చెన్నై వరద బాధితుల్ని ఆదుకునేందుకు తమిళనాట విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ తారలు విరాళాల విషయంలో పోటీలు పడుతున్నారు. అభిమానులు మా హీరో ఎక్కువిచ్చాడంటే మా హీరో ఎక్కువిచ్చాడంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. హీరోల్లో అత్యధికంగా రజినీకాంత్ రూ.10 కోట్లివ్వగా.. విజయ్ రూ.5 కోట్ల విరాళంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఐతే విరాళాల విషయంలో హీరోలకు దీటుగా ఇప్పుడో నిర్మాత భారీ విరాళంతో ముందుకొచ్చాడు. ఆ నిర్మాత పేరు సబాస్కరన్. శంకర్ దర్శకత్వంలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రోబో-2ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ అధినేతే ఈ సబాస్కరన్.
ఐతే పరిశ్రమ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నపుడు సైలెంటుగా ఉన్న సబాస్కరన్.. సరిగ్గా రోబో-2 ప్రారంభమైన వెంటనే మంచి టైమింగ్ చూసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఈ ఐదు కోట్ల విరాళాన్ని అందజేయడం విశేషం. ఒక రకంగా రోబో-2 ప్రమోషన్ కి కూడా దీన్ని వాడేసుకున్నాడతను. ఏడాది కిందట ఈ లైకా ప్రొడక్షన్స్ కు వ్యతిరేకంగా చెన్నైతో పాటు తమిళనాడు అంతా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ సంస్థ నిర్మించిన ‘కత్తి’% సినిమాను అడ్డుకున్నారు కూడా. శ్రీలంకలో తమిళుల పట్ల దారుణంగా వ్యవహరించిన ఆ దేశ అధ్యక్షుడు రాజ పక్సతో ఈ సంస్థకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆ సంస్థపై విరుచుకుపడ్డారు చాలామంది. చాలా గొడవల తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది.