సౌత్ ఇండియా మార్కెట్ లెక్కలు మొత్తం మార్చేసిన సినిమా రోబో. బాలీవుడ్ వాళ్లే వంద కోట్ల బడ్జెట్ అంటే భయపడుతున్న రోజుల్లో శంకర్ రోబో మీద 130 కోట్ల దాకా బడ్జెట్ పెట్టించాడు. ఇది చాలా పెద్ద రిస్క్ అని అనుకున్నారు కానీ.. ఆ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ఐతే శంకర్ మీద ఎంతైనా నమ్మకం ఉండొచ్చు కానీ.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 130 కోట్లు ఖర్చు చేసే ధైర్యం అందరికీ ఉండదు. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ మాత్రమే ఈ సాహసం చేయగలిగాడు. ఆ సాహసానికి సరైన ఫలితం కూడా అందుకున్నాడు. ఐతే ఇప్పుడు శంకర్ రోబో-2ను ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో తీయాలని చూస్తున్నాడు. కానీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మారన్ ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసే పరిస్థితుల్లో లేడు.
ఐ సినిమా విడుదలైన ఏడు నెలలకు కూడా రోబో-2 గురించి అనౌన్స్‌మెంట్ రాకపోవడానికి నిర్మాత దొరక్కపోవడమే కారణం. ఐతే ఈ మధ్యే రోబో-2కు నిర్మాత దొరికినట్లు సమాచారం. గత ఏడాది విజయ్‌తో ‘కత్తి’ తీసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘రోబో-2’ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ సంస్థకు శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స ఆర్థిక సహకారం ఉందంటూ అప్పట్లో తమిళనాట పెద్ద గొడవే జరిగింది. కత్తి సినిమా విడుదలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐతే ఆ వివాదానికి అప్పట్లో తెరపడటంతో ఇప్పుడు రోబో-2 మీద కన్నేసింది లైకా ప్రొడక్షన్స్. కత్తి సినిమాతో భారీగా డబ్బులు మిగలడంతో రోబో-2 మీద శంకర్ ఆశించిన స్థాయిలోనే బడ్జెట్ పెట్టబోతోంది లైకా ప్రొడక్షన్స్. త్వరలోనే సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.