అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘గీతాగోవిందం’ ఏదో వివాదంతో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. నిన్ననే ‘వాట్ ద ఎఫ్’ అనే పాటలో సీతాదేవి-సావిత్రిల ప్రస్తావరణ రావడంతో దుమారం రేగింది. దీంతో లిరిక్స్ మీద సంప్రదాయ వాదులు అభ్యంతరం తెలిపారు. ఇది పెద్ద వివాదం కాకముందే చిత్రం యూనిట్ స్పందించి ఆ పాటను యూట్యూబ్ నుంచి తీసేసింది.
ఈ నేపథ్యంలోనే పాటలోని కొన్ని పదాలను తొలగిస్తామని తాజాగా ఆ పాట రాసిన శ్రీమణి వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. గీతాగోవిందంలోని అమెరికా గాళ్ ఐనా అనే పాటలోని కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మంది మనోభావాలు గాయపరిచాయని.. అందుకే ఆ పాటలోని అభ్యంతరకర పదాలను తొలిగిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. మళ్లీ రచించి ఆ పాటను తిరిగి యూట్యూబ్ లో త్వరలోనే విడుదల చేస్తామని ఆమె తెలిపారు..
ఇప్పటికే గీతాగోవిందం సినిమాలోని పాటలకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి... త్వరలోనే విడుదల కాబోతున్న ఈ మూవీకి ఇప్పుడు ఈ పాటల వివాదంతో మరింత ప్రచారం వచ్చింది. ఏది ఏమైనా వివాదాల జోలికి పోకుండా చిత్రం యూనిట్ ముందే సర్ధుకుంటుండడం విశేషం.