మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు- జీవిత- హేమ- సీ.ఎల్ నరసింహారావు రేసులో ఉన్నారు.
ఈ ఆదివారం మంచు విష్ణు స్వయంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకటించడంతో వార్ పీక్స్ కి చేరుకుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని ప్రకటించి వార్ కి కాలు దువ్వగా విష్ణుకి పూర్తి క్లారిటీ వచ్చేసింది. అయితే పోటీ కేవలం రెండు ప్యానెళ్ల నడుమ మాత్రమే ఉంటేనే రక్తి కట్టిస్తుంది. ఎక్కువమంది పోటీ చేస్తే ఓట్ల చీలిక విష్ణుకి మైనస్ గా మారుతుందని భావిస్తున్నారు.
కారణం ఏదైనా కొడుకు కోసం మంచు మోహన్ బాబు బరిలో దిగారని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే జీవితను పోటీనుంచి విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హేమతోనూ మాట్లాడేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్టిస్టుల తరపున ఐదో అభ్యర్థి సి.ఎల్ నరసింహారావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ పోటీ నుంచి జీవిత విరమిస్తారా? అంటే తన వెర్షన్ వేరుగా ఉంది. ``నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నందున నా నిర్ణయాన్ని ప్రకటించడానికి చాలా సమయం ఉంది..`` అని జీవిత అన్నారు. ఒకవేళ జీవిత రాజశేఖర్ నిజంగానే విరమించుకుని విష్ణుకు మద్ధతునిస్తారా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.