ప్రముఖ వెటరన్ లిరిసిస్ట్ వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గాయని చిన్మయి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పర్యవసానం తెలిసిందే. ఇప్పటికీ వైరముత్తుపై చిన్మయి ఏదో ఒక వాదన తెరపైకి తెస్తూనే ఉన్నారు. సుదీర్ఘ కాలం తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న గాయనిగా చిన్మయి పేరు హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.
ఇటీవలి ట్విట్టర్ సెషన్లో చిన్మయి మాట్లాడుతూ.. వైరముత్తు వారసుడు మాధన్ కార్కీ బలవంతం కారణంగానే అతడి తండ్రి వైరముత్తును తన పెళ్లికి ఆహ్వానించానని చిన్మయి అన్నారు. కానీ దానిని ఖండిస్తూ.. చిన్మయి వాదన మరో అబద్ధమని కార్కీ వాదిస్తున్నారు. ``ఇది మరొక అబద్ధం. ఆమె తన పెళ్లికి నాన్నను ఆహ్వానించాలనుకుంది. కాని నాన్న ఆమెతో కలతల్లో ఉన్నందున అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. నన్ను అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరింది. నేను ఆమె కోసం తీసుకున్నాను. ఆమె అతని వద్దకు వెళ్ళింది. ఒంటరిగానే వెళ్లి అతని పాదాలను తాకి దీవెనలు పొంది పెళ్లికి ఆహ్వానించింది`` అని తెలిపారు.
చిన్మయి ఇప్పుడు కార్కీ చెప్పేవన్నీ నిజాలు కావని .. ఒకప్పుడు తాను వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు కార్కి ఆయన భార్య తన పక్షాన ఉన్నారని .. కానీ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా కానీ ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదు. దశాబ్ధాల నాటి సంగతి కాబట్టి.. నిరూపించే ఆధారాల్ని చిన్మయి సమర్పించలేనందున ఆయన దీనినుంచి బయటపడ్డారని గుసగుసలు వినిపించాయి.