బాహుబలి2 చరిత్ర సృష్టించేయడంతో.. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సంచలనాలు కాసింత మరుగున పడ్డాయ్ కానీ.. చాలామందికి సెకండ్ పార్ట్ కంటే మొదటి భాగమే నచ్చింది. ఈ మూవీలో కాలకేయుడి పాత్రతో చెప్పించిన కిలికి భాష కూడా బాహుబలికి ప్రత్యేక ఆకర్షణ.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. బాహుబలి తమిళ్ వెర్షన్ కు మాటలు..పాటలు రాయడంతో పాటు కిలికి భాషను సృష్టించిన రైటర్ మదన్. దిగ్గజ రచయిత వైరముత్తు తనయుడైన మదన్.. ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయాడు. ఇందుకు కారణం.. జీఎస్టీ అమలు కారణంగా కోలీవుడ్ సినీ పరిశ్రమలో నెలకొన్న ప్రతిష్టంభనతో.. ఇతడో డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. జీఎస్టీ అమలు కారణంగా.. నిర్మాతలపై భారం పెరగడంతో.. దీనిపై తగిన నిర్ణయం వచ్చే వరకూ.. తన పారితోషికంలో 15 శాతం తగ్గించుకుంటున్నట్లు చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ రైటర్. మదన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
జీఎస్టీ లో సినిమా రంగంపై భారీగా పన్ను విధించడాన్ని టాలీవుడ్ మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. తమిళ నాట మాత్రం పెద్ద స్థాయిలో హంగామా జరుగుతోంది. థియేటర్లు మూసేసి.. షూటింగ్స్ ఆపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్.. శంకర్ లాంటి దిగ్గజాలు కూడా పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.