ఓపెన్ గా విషయాల్ని చెప్పేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువైందని చెప్పాలి. గతంలో మాదిరి కాకుండా సెలబ్రిటీలు ఓపెన్ కావటం.. తెర వెనుక జరిగే ముచ్చట్ల గురించి పబ్లిక్ గా మాట్లాడేసే వైనం ఇప్పుడు కనిపిస్తోంది. తమను తాము సెన్సార్ విధించినట్లుగా కొన్ని ప్రశ్నల్ని మాత్రమే అచ్చేయటం.. టెలికాస్ట్ చేసే నాట్ నాట్ సెంచరీల సంప్రదాయ మీడియాకు భిన్నంగా.. ఈ మధ్యన ప్రైవేటు ఇంటర్వ్యూల్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇవి సంచలనంగా మారటమే కాదు.. పెద్దపెద్ద డిబేట్లకు దారి తీస్తున్నాయి.
తాజాగా అలాంటి ఒక ఇంటర్య్వూలో సంచలన విషయాల్ని వెల్లడించారు నచ్చావులే హీరోయిన్ మాధవీలత. అసలుసిసలు తెలుగమ్మాయ్ గా.. అందం చందం ఉన్నప్పటికీ అవకాశాలు అంతగా రాని విషయాలపై ఓపెన్ గా మాట్లాడేసిన ఆమె మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సినిమా ఛాన్సుల కోసం ‘కోఆపరేట్’ చేయాలన్న విషయం తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఎంతో డీటైల్డ్ గా చెప్పిన మాధవిలత.. బయటకు పెద్దగా రాని ఒక విషయాన్ని వెల్లడించి కొత్త చర్చకు తావిచ్చారు.
సినిమా ఛాన్స్ లకే కాదు.. సెలబ్రిటీలు తరచూ వెళ్లే ఫారిన్ టూర్లకు సైతం ‘కోఆపరేషన్’ చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ.. ఎక్కువ సందర్భాల్లో మాత్రం కోఆపరేషన్ చాలా ముఖ్యమని.. అదే కానీ లేకపోతే విదేశాల్లో షోలు చేసే అవకాశం రాదని చెప్పుకొచ్చారు. ప్రతి రంగంలోనూ ఇలాంటివి ఉన్నాయని.. కాకుంటే.. గ్లామర్ ఫీల్డ్ కావటంతో.. ఇదో పెద్ద విషయంగా మాట్లాడుకుంటారని చెప్పారు.
ఫారిన్ లో చేసే షోలకు ఎంపిక చేసే సమయంలో కొంతమంది అయితే.. ఓపెన్ గానే మాట్లాడుకుంటారని.. మరికొందరు మాత్రం డీసెంట్ గా అక్కడికి వెళ్లిన తర్వాత ప్రపోజల్ తీసుకొస్తారని చెప్పారు. తనకు లభించిన చాలా అవకాశాలు.. వేరే వారు వెళ్లాల్సిన వేళ.. వారు వెళ్లలేని టైంలో తనను రీప్లేస్ చేసేలా తాను వెళ్లినట్లుగా చెప్పుకొన్నారు. ఫారిన్ షోల సందర్భంగా తనను కోఆపరేట్ చేయాలన్న మాట ఎవరూ చెప్పలేదని.. తన గురించి ఇండస్ట్రీలో వినిపించే మాటలే కారణమై ఉండొచ్చాన్నారు. ఏమైనా.. సినిమా ఛాన్స్ లే కాదు.. విదేశీ షోలకు ఎంపిక చేయాలో ఏం ఉండాలో మాధవీలత ఓపెన్ చేసేశారని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/