వాళ్ళ కంటే నేనే తోపు అంటున్న ఆంటీ!

Update: 2020-03-19 14:30 GMT
మాధురీ దీక్షిత్.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని అలనాటి హీరోయిన్. ఏక్ దో తీన్ అంటూ కుర్రకారును కిర్రెక్కించినా, ధక్ ధక్ కర్నే లగా అంటూ ప్రేమికులని ఉర్రూతలూగించినా, చోలి కే పీచే క్యా హై అనే పాట తో మాస్ ప్రేక్షకులను మైమరింపించినా, దీదీ తేరా దేవర్ దీవానా అంటూ కవ్వించినా అది ఆమెకే చెల్లింది. సినీ పరిశ్రమలో అందం తో పాటు ప్రతిభ కలిగియున్న అతికొద్ది నటీమణులలో మాధురి దీక్షిత్ ఒకరు. యావత్ భారతదేశాన్ని తన నటన తో ఆమె వైపు చూసేలా చేసుకున్నారు మాధురీ దీక్షిత్. అద్భుతమైన పాత్రల్లో నటించడం తో పాటు ఐటెం సాంగ్‌లలో కూడా ఇరుగదీశారంటే అతిశయోక్తి కాదు. తేజాబ్ మూవీలో ఏక్ దో తీన్ పాటతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడమే కాకుండా ఓవరనైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే అమెరికా డాక్టర్ శ్రీరామ్ ను వివాహం చేసుకొని కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన మాధురీ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక షోలో ప్రస్తుత హీరోయిన్ల డ్యాన్సులు, స్టెప్పులపై హాట్ కామెంట్స్ చేసి మాధురీ వార్తల్లో నిలిచారు.

ఈ షోలో ప్రస్తుత హీరోయిన్ల తీరుతెన్నులను గురించి మాట్లాడుతూ కరీనా, కత్రినాలో ఎవరు బెస్ట్ డ్యానర్ అనే విషయంపై రేటింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. తనకంటే గొప్ప డ్యాన్సర్ ఎవరు లేరనే చెప్పారు. దాంతో ఇప్పటికీ తానే నంబర్ వన్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన మున్నీ బద్నాం హుయీ, షీలా కీ జవానీ, చిక్నీ చమేలీ, ఫెవికాల్ లాంటి పాటల్లో ఎవరు బాగా స్టెప్పులు వేశారు అని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అందరి కంటే నేనే బాగా చేస్తాను అంటూ మాధురి దీక్షిత్ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News