మహేష్ బాబుకు ఫ్యామిలీస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అది అతడు సినిమా టీవీల్లో రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్నప్పుడు తొలిసారి అందరికీ అర్దమైంది. అప్పటిదాకా యూత్ కు మాత్రమే మహేష్ ఎక్కుతున్నాడు అనుకున్నవాళ్లు ..లేదు ..మహేష్ ఉంటే ఫ్యామిలీ మొత్తం పండగ చేసుకుంటారనే విషయం అర్దం చేసుకున్నారు. అప్పటినుంచి మహేష్ బాబు ఫ్లాఫ్ సినిమాలు సైతం టీవిల్లో తెగ ఆడేస్తున్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఉన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటివి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన టీవి అభిమానుల ఖాతాలో మరొకటి చేరింది. అదే 'మహర్షి'.చ
వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మహర్షి రీసెంట్ గా జెమినీ టీవీలో తొమ్మిదో సారి ప్రసారం అయ్యింది. అలాగే మరోసారి మంచి రేటింగ్స్‌ను దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఓ రెండు సార్లు అయ్యేసరికి టీవిల్లో సినిమా రిపీట్ అయ్యితే టీఆర్పీలు బాగా తక్కువ వస్తూంటాయి. అందులోనూ సందేశాత్మక చిత్రాలంటే మరీను. కానీ చిత్రంగా 'మహర్షి' టీవి ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. టీవీలు బాగా చూసే ఆడవాళ్లు ఈ సినిమాని రికార్డ్ లు బ్రద్దలు కొట్టే స్దాయిలో చూసేస్తున్నారు.
తాజాగా తొమ్మిదో సారి టెలికాస్ట్ అయిన మహర్షి 4.92 టిఆర్పీని తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేయటం అంతటా విశేషంగా చెప్పుకుంటున్నారు. ఓ సినిమా తొమ్మిది సార్లు ప్రసారం అయ్యి కూడా ఇంత రేటింగ్‌ను తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు అని మెచ్చుకుంటున్నారు విశ్లేషకులు. గతంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా టెలివిజన్ లో ప్రసారం అయ్యి రికార్డు స్థాయిలో 29.4 రేటింగ్ సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది.