సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' మే 9 న రిలీజ్ అయింది. ఇప్పటికి దాదాపు గా నెల రోజుల రన్ పూర్తి కావస్తోంది. ఈ సినిమా రూ. 175 కోట్ల గ్రాస్ సాధించిందని నిర్మాతలు ఈమధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఓవర్సీస్ లో కూడా దాదాపుగా 'మహర్షి' రన్ పూర్తయింది. ఓవరాల్ గా సినిమాకు ఓవర్సీస్ లోనష్టాలు వచ్చాయని సమాచారం.
అమెరికా.. నాన్ అమెరికా అన్ని ఏరియాలకు కలిపి ఓవర్సీస్ రైట్స్ ను 11.5 కోట్లకు అమ్మారట. ఇప్పటివరకూ ఓవర్సీస్ లో $1.88 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. అంటే రూ. 9.55 కోట్లు మాత్రమే రికవర్ చేసింది. ఈ లెక్కన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు దాదాపుగా ఒకటిన్నర కోటి కంటే ఎక్కువగా నష్టం వచ్చినట్ట లెక్క. లాభనష్టాల సంగతి పక్కన పెడితే 'మహర్షి' మహేష్ కెరీర్ లో ఓవర్సీస్ లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 'భరత్ అనే నేను'.. 'శ్రీమంతుడు' రెండవ స్థానంలో ఉంది.
ఓవర్సీస్ లో మహేష్ బాబు మార్కెట్ మొదటి నుంచి భారీగా ఉండేది. జస్ట్ ప్రీమియర్ల ద్వారానే వన్ మిలియన్ డాలర్లు సంపాదించగల హీరోలలో మహేష్ ఒకరు. కానీ ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారా హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. దానివల్లే 'మహర్షి' ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడం వీలు కాలేదు. ఎదేమనా ఓవర్సీస్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మహేష్ కు ఈ ఫలితం నిరాశకలిగించేదే.