సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన `మహర్షి` మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్ చిత్రీకరణలు సహా నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. రిలీజ్ కి ఇంకో నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్రమంలోనే దిల్ రాజు అండ్ టీమ్ ప్రమోషన్ లో వేడి పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. `మహర్షి` ఆన్ లొకేషన్ ఉండగా కొన్ని లీకేజీ ఫోటోలు మినహా ఈ సినిమాకి సంబంధించిన సరైన మెటీరియల్ ని ఇంతవరకూ రిలీజ్ చేయనేలేదు. ఇటీవలే `మహేష్- అల్లరి నరేష్- పూజా హెగ్డే` కాంబినేషన్ ఫోటోల్ని రివీల్ చేశారు. చోటి చోటి భాతే .. అంటూ ఓ సింగిల్ ని రిలీజ్ చేశారు. వీటికి మహేష్ అభిమానుల నుంచి స్పందన బావుంది. అయితే అంత భారీ చిత్రానికి ఈ మెటీరియల్ సరిపోతుందా? అంటే మహేష్ అభిమానులు ఇంకా నిరాశలోనే ఉన్నారు.
అందుకే ఈ ఉగాది కానుకగా టీజర్ రిలీజ్ చేస్తున్నామని మహర్షి టీమ్ ప్రకటించగానే ఫ్యాన్స్ లో ఒకటే ఎగ్జయిట్‌మెంట్ కనిపిస్తోంది. టీజర్ తో `మహర్షి`కి కొత్త ఊపు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. పబ్లిసిటీలో మహర్షికి సంబంధించి సరైన ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయని యూనిట్ ఇకపై ప్రచారం పరంగా పూర్తి స్థాయిలో వర్కవుట్ చేయాలని భావిస్తోంది. వరుసగా వారం వారం ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తూ ఈ నెలరోజులు ప్రచారం హోరెత్తించేస్తారట. ప్రీరిలీజ్ వేడుకను అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్ రెండు చోట్లా ప్రచార వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారట. ప్రస్తుతం దీనిపై ఫ్యాన్స్ లో ఒకటే ఎగ్జయిట్ మెంట్ నెలకొంది.
ఉగాది కానుకగా ఏప్రిల్ 6న టీజర్ రిలీజ్ తమకు బిగ్ న్యూస్ అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉగాది వరకూ ఆగలేని సన్నివేశమే కనిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ఎగ్జయిట్ మెంట్ అంతకంతకు పెరుగుతున్నట్టే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన దర్శకుడు వంశీ పైడిపల్లి వందరోజులుగా కఠోరంగా శ్రమించారని అర్థమవుతోంది. తాజాగా రివీలైన కొన్ని ఫోటోల్లో ఆయన మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఫుటేజ్ ఏకంగా 4 గంటల నిడివితో ఉందిట. దీనిని ఎడిట్ చేసేందుకే చాలా సమయం పడుతోందని సమాచారం. దిల్ రాజు- అశ్వనిదత్ - పీవీపీ బృందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.