సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహర్షి టీజర్ ఉగాది పండగ సందర్భంగా వచ్చేసింది. ఆశించినట్టే ప్రిన్స్ ని నెవర్ బిఫోర్ స్టైల్ లో ప్రెజెంట్ చేసినట్టు విజువల్స్ చూస్తేనే తెలిసిపోతోంది. ఓపెనింగ్ షాట్ లో హెలికాప్టర్ నుంచి దిగుతున్న ఖరీదైన సూట్ లో మహేష్ అతని వెనుక రక్షణ కోసం ఉన్న వ్యక్తిగత సిబ్బంది చూస్తుంటేనే అమెరికాలో ఏదో పెద్ద సంస్థకు సిఈఓ అనే క్లారిటీ ఇచ్చేశారు.
ఇది రిషి కుమార్(మహేష్ బాబు)కథ. సక్సెస్ కు కామాలు ఉంటాయి కాని ఫుల్ స్టాప్ లు ఉండవని బలంగా నమ్మే వ్యక్తి. కాలేజీ ఏజ్ నుంచి బిజినెస్ మ్యాన్ స్థాయి దాకా దీన్నే నమ్ముతూ బలంగా పాటిస్తూ ఉంటాడు. ఎవరైనా నువ్వు ఓడిపోతావు అని రిషితో అంటే గెలిచి చూపించే వరకు నిద్రపోని తత్వం అతనిది. ఈ క్రమంలో కొన్ని ప్రమాదకరమైన సవాళ్ళు ఎదురవుతాయి. వాటికి ధీటుగా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో ఎలా నెగ్గాడో చెప్పడమే మహర్షి
టీజర్ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో. అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ బిట్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు. కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చేసుకున్న మార్పు సన్నని గెడ్డంతో మీసంతో కాలేజీ కుర్రాడిగా కనిపించే తీరు యూత్ ని పూర్తిగా పడగొట్టడం ఖాయం. ప్రిన్స్ ట్రేడ్ మార్క్ చేజింగ్ కూడా ఇందులో పొందుపరిచారు.
దేవి శ్రీ ప్రసాద్ బ్రాండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది. హీరొయిన్ పూజా హెగ్డేతో సహా ఇంకే పాత్రను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు. రౌడీలను గాల్లో ఎగరేసి కొట్టే సీన్ కు గూస్ బంప్స్ ఖాయం. మొత్తానికి అభిమానుల కోసం వచ్చిన మహర్షి టీజర్ వాళ్ళకు రిలీజ్ డేట్ మే 9 దాకా ఎదురు చూడటం కష్టం అనే రేంజ్ లో ఉంది.
Full View