రన్ టైమ్‌ లోనూ 'మహా' అనిపించేలా..!

Update: 2021-10-03 02:30 GMT
శర్వానంద్‌ హీరోగా సిద్దార్థ్ కీలక పాత్రలో నటించిన మహా సముద్రం విడుదలకు సిద్దం అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు అదితి రావు మరియు అను ఎమాన్యూల్ లు నటించారు. శర్వానంద్‌ మరియు సిద్దార్థ్‌ ల మద్య ఉండే సంబంధం ఏంటీ.. సినిమాలో సిద్దార్థ్ విలన్ గా కనిపించబోతున్నాడా అనే అంశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్‌ ఎక్స్ 100 సినిమా విడుదల అయిన కొన్నాళ్లకే దర్శకుడు అజయ్‌ భూపతి ఈ సినిమాను అనుకున్నాడు. కాని కథ కు తగ్గ హీరోలు సెట్ కాకపోవడం.. హీరోలు సెట్‌ అయినా వారి డేట్లతో క్లాష్ రావడం అలా ఏదో ఒక కారణం వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు శర్వానంద్‌ హీరోగా నటించిన మహా సముద్రం విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలకు ఈ సినిమా సిద్దం అయ్యింది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహా సముద్రం రన్ టైమ్‌ ను 153 నిమిషాలకు ఖరారు చేయడం జరిగిందట. ఈమద్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలు రెండు గంటలకు కాస్త అటు ఇటుగా రన్ టైమ్ తో వస్తున్నాయి. ఎక్కువ శాతం 130 నుండి 140 నిమిషాల రన్‌ టైమ్‌ తో వస్తున్నాయి. కాని ఈ సినిమా మాత్రం రెండున్నర గంటలకు ఎక్కువ ఉండబోతుంది. సినిమా కథానుసారం రన్‌ టైమ్ ను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సినిమాలు రన్ టైమ్‌ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని సార్లు బ్యాడ్ టాక్ వచ్చాయి. కనుక ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఇప్పటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో కాస్త ఎక్కువ అయ్యిందనే విధంగా టాక్ నడుస్తోంది.

కంటెంట్ బాగున్న సినిమాలు మూడు గంటలు కూడా ప్రేక్షకులు చూస్తారు. కాని కాస్త బోరింగ్‌ సన్నివేశాలు ఉన్నా కూడా సినిమా చూడలేక విసుగు వస్తుంది. ఆ సన్నివేశాలు మొత్తం సినిమా పై ప్రభావం పడుతుంది. అందుకే రన్ టైమ్ విషయంలో మహా సముద్రం రెండున్నర గంటలకు ఎక్కువగానే ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి కంటెంట్ పై వారికి చాలా నమ్మకంగా ఉండి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా మహా సముద్రం టైటిల్ కు తగ్గట్లుగానే రన్ టైమ్ కూడా మహాగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. రన్ టైమ్‌ విషయంలో మరింత స్పష్టత రావాలంటే సెన్సార్ రిపోర్ట్‌ రావాల్సి ఉంది.
Tags:    

Similar News