#మహేష్‌25.. మళ్ళీ కోర్టు గొడవలా??

Update: 2018-06-18 07:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎంతో కీలకంగా మారనున్న 25వ చిత్ర కోసం ప్రస్తుతం అభిమానులుఎంతగానో ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి లాంటి కమర్షియల్ దర్శకుడు అన్ని కోణాల్లో సినిమాను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్మాత దిల్ రాజు సి.అశ్విని దత్ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ప్లాన్స్ చేసుకున్నారు. సోమవారం డెహ్రాడన్ లో షూటింగ్  కూడా స్టార్ట్  చేసేశారు.

అంతా బాగానే ఉంది గాని ఈ సినిమాకు కోర్టు సమస్యలు మరోసారి తలెత్తాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ ఈ ప్రాజెక్ట్ పై కేసు వేసింది. మొదట్లోనే కేసు నమోదైంది. అయినా కూడా సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. అసలైతే ఈ సినిమాను పివిపి నిర్మించాలి. గతంలో ఈ ప్రొడక్షన్ లో మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేశాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా కూడా ఇదే ప్రొడక్షన్ లో నిర్మించారు. అయితే వారిద్దరి కాంబినేషన్ ను కలపాలని ప్రసాద్ వి పొట్లూరి ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో మరి సినిమా సడన్ గా వేరే ప్రొడక్షన్స్ లోకి షిఫ్ట్ అయ్యింది. అదే విషయమై పివిపి కోర్టుకెక్కారు. కాని ఇంకా తీర్పు వెలువడక ముందే ఈ సినిమాను మొదలుపెట్టడంతో.. ఇప్పుడు మళ్ళీ మ్యాటర్ మొదటికే వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పుడు ఆ సినిమాను అడ్డుకునేందుకు మరోసారి కోర్టు తలుపులు తట్టేశారట పివిపి. ఈ నెల 21న మరోసారి ఈ విషయంపై కోర్టు విచారణ జరపనుంది. అప్పటివరకు షూటింగ్ జరిగే అవకాశం లేదని అంటున్నారు.



Tags:    

Similar News