సూపర్ స్టార్ అని పిలిపించుకుంటే సరిపోదు.. ఆ స్టేటస్ కు తగ్గ స్టామినా చూపించాలి. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా హవా సాగించాలి. ఇక్కడ మన మహేష్ బాబు.. అక్కడ రజినీకాంత్.. అదే చేశారు. తాము నిజమైన సూపర్ స్టార్ లమని రుజువు చేసుకున్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లు. 1 నేనొక్కడినే - ఆగడు రెండూ కూడా అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. దారుణమైన నష్టాల్ని మిగిల్చాయి. మామూలుగా ఒక్క ఫ్లాపుకే హీరో మార్కెట్ దెబ్బ తింటుంది. వరుసగా రెండు ఫ్లాపులంటే చెప్పాల్సిన పని లేదు. కానీ 1, ఆగడు సినిమాల ప్రభావం ‘శ్రీమంతుడు’ మీద ఏమాత్రం పడలేదు. మహేష్ కెరీర్ లోనే అత్యధిక లాభాలు వచ్చిన సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దీంతో మహేష్ నిజమైన సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.
ఇక మహేష్ కంటే పెద్ద సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ సంగతి చూద్దాం. కోచ్చడయాన్ - లింగ సినిమాల ఫలితాలేంటో తెలిసిందే. కానీ వాటి ప్రభావం ఏమీ రజినీ తర్వాతి సినిమా ‘కబాలి’ మీద పడలేదు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం ఓవర్సీస్ వరకే రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. రజినీ గత సినిమాల రికార్డులన్నీ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘లింగ’ యుఎస్ రైట్స్ రూ.7 కోట్లు పలికితే.. ‘కబాలి’కి రూ.9 కోట్లిచ్చి హక్కులు తీసేసుకున్నారు. ఇక మలేషియా రైట్స్ అయితే రూ.11 కోట్లు పలికాయి. లింగా రైట్స్ అక్కడ రూ.7.3 కోట్లకు అమ్ముడయ్యాయి. మిగతా ఏరియాల్లో కూడా రికార్డ్ ప్రైస్ పలుకుతున్నట్లు సమాచారం. మొత్తానికి రజినీ కూడా నిజమైన సూపర్ స్టార్ అనడంలో ఇంకేమైనా సందేహమా?