మహేష్ కోసం త్రివిక్రమ్ అలాంటి స్టోరీ రెడీ చేస్తున్నాడా..?

Update: 2021-08-28 16:39 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత వీరి కాంబోలో రానున్న '#SSMB28' పై సినీ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అలానే ఈసారి ఎలాంటి సినిమాతో రాబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది.

మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు' సూపర్ హిట్ అవ్వగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఖలేజా' నిరాశపరిచింది. ఈ రెండు సినిమాలు బుల్లితెరపై విశేష స్పందన తెచ్చుకొని క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఈ క్రమంలో 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ రివేంజ్ డ్రామాతో రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదొక యాక్షన్ జోనర్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని #SSMB28 మేకర్స్ చెబుతున్నారు. ఇందులో మహేష్ బాబు పాత్రను విభిన్నంగా పరిచయం చేయబోతున్నారని.. సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ లు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ తరహా ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై ఎస్. రాధాకృష్ణ‌ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత #SSMB28 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సూపర్ స్టార్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.


Tags:    

Similar News