సినిమాల్లో తప్ప బయట అస్సలే మాత్రం హంగు ఆర్భాటాలు ప్రదర్శించడు మహేష్. డ్రెస్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్సులేసుకొని కనిపిస్తుంటారు. ఆయన సినిమా వేడుకలకి కూడా అలాగే హాజరవుతుంటాడు. మిగతా హీరోలు మాత్రం సూటూబూటూ టక్కు, టై కట్టుకొని వస్తుంటారు. మహేష్ మాత్రం ఎప్పుడూ ఒకే స్టైలే. అయితే ఇటీవల మాత్రం ఆయన కాస్త స్టైల్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది. బయట జరిగే సినిమా వేడుకలకి జీన్స్, క్యాజువల్స్ వేసుకొని వస్తున్నారు. శ్రీమంతుడు ఆడియోకి ఆయన జీన్స్ వేసుకొని వచ్చాడు. మిర్చి అవార్డ్స్ ఫంక్షన్ కు కూడా జీన్స్ ధరించాడు. దీంతో ఆయన అందరికీ కొత్తగా కనిపించాడు.
ఈ ఛేంజ్ వెనక మహేష్ భార్య నమ్రత ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ కి ఫ్యాషన్ పై చాలా అవగాహన ఉంది. ఇదివరకు స్టైల్ విషయంలో చాలా ప్రయోగాలు చేసేవాడు. కానీ ఇటీవల మాత్రం నార్మల్ గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి వ్యక్తిగతంగా హెయిర్ స్టైలిష్ట్, ఫ్యాషన్ డిజైనర్ ఉన్నప్పటికీ... అదంతా సినిమాకే పరిమితం చేస్తున్నాడు. సినిమాలో ఎలా కనిపించాలో దర్శకుడిని అడగమని ఆ స్టైలిష్ట్ లే తెలుసుకొంటారు. వాళ్లు చెప్పినట్టు మహేష్ తెరపై కనిపిస్తుంటాడు. కానీ రెగ్యులర్ లైఫ్ లో మాత్రం అన్నీ మహేషే. బయట జరిగే ఫంక్షన్లకు డ్రెస్సులు మాత్రం తనకు ఇష్టం వచ్చినవే వేసుకొంటుంటాడు మహేష్. కంఫర్ట్ కి మించిన స్టైలేముంటుంది? అనేది ఆయన మాట. అందుకే ఫార్మల్ డ్రెస్సుల్లోనే కనిపించాడు. ఇటీవల మాత్రం క్యాజువల్, జీన్స్ కి మారడానికి కారణం మాత్రం భార్య నమ్రతనేనట. బయట ఫంక్షన్లలోనూ అప్పుడప్పుడు కొత్తగా కనిపించాల్సిందే అని ఆమె చెప్పారట. దీంతో మహేష్ స్టైల్ మార్చినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన్ని వేడుకల్లో సూటూబూటూతో చూసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట.