క్లైమాక్స్ చెక్కుతున్న మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది డిజాస్టర్స్ అందుకున్న మహేష్ ఈ సారి హ్యాట్రిక్ డిజాస్టర్ పడకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
గత రెండు రోజులుగా సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో చాలా స్పీడ్ గా జరుగుతోంది. సినిమా క్లైమాక్స్ సీన్స్ తో పాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలకు డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే షూటింగ్ లో దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఒక్కో షాట్ ను చాలా ఆసక్తికరంగా తీయడం వలనే.. ఈ చెక్కుడు కార్యక్రమం కాస్త స్లో అయ్యిందట. అయినాసరే మరికొన్ని రోజుల్లో ఈ వర్క్ ని ఫినిష్ చేసి సాంగ్స్ ని కూడా ఫినిష్ చేయనున్నారు.
మొత్తానికి దర్శకుడు ఫిబ్రవరి ఎండింగ్ లో సినిమాకు సంబందించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మార్చ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి ప్రమోషన్స్ ని కంటిన్యూ చేయాలనీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. డివివి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.