తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో.. ఇంకో 20 ఏళ్లు కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదు.. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ … ఎలా చూసినా సూపర్ స్టార్ మహేశ్ చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు. ఏడాదికో సినిమా, మధ్య మధ్యలో యాడ్స్ ఆదాయానికి అంతే లేదు. అయినా కూడా మహేశ్ దృష్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై పడింది. ఇండస్ట్రీ లో చాలా క్రాఫ్ట్స్ ఉన్నా కానీ మహేశ్ మాత్రం ఏరికోరి.. సినిమా థియేటర్స్ బిజినెస్ లోకి దిగాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి గచ్చీబౌలిలో AMB మూవీ మాల్ కట్టాడు. త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా మల్టీప్లెక్సులు కట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ కు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. కానీ ఆయన భార్య నమ్రత కు ముందు చూపు ఎక్కువ. ఆమే ఆలోచించి మహేశ్ ని శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మార్చింది. ఆ తర్వాత ఇప్పుడు మల్టీప్లెక్స్ ఓనర్ ని చేసింది. చాలా నిశితంగా గమనిస్తే.. దీని వెనుకు చాలా పెద్ద ప్లానే ఉంది. ఇండస్ట్రీలో ఏ హీరో సక్కెస్ అవ్వాలన్నా హిట్స్ , నిర్మాతలు అవసరం. కాని ఇప్పుడు వీటితో పాటు థియేటర్స్ కూడా కావాలి. థియేటర్స్ చేతిలో లేకపోతే.. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా పనికిరాదు.
సురేశ్ బాబు, అల్లు అరవింద్ సినిమాలకు వారే నిర్మాతలు. వారే డిస్ట్రిబ్యూటర్లు. థియేటర్లు కూడా వారివే. అందుకే వారి వారసుల్ని ఇండస్ట్రీలో నిలబెట్టుకోగలిగారు. అదే సమయంలో.. మోహన్ బాబు ఇద్దరు తనయులు టాలెంట్ ఉన్నవాళ్లే. డబ్బు పెట్టి సినిమా తీసేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నా.. థియేటర్స్ లో రిలీజ్ అవుతాయో లేదో తెలీని పరిస్థితి. అదే మన చేతిలో థియేటర్స్ ఉంటే.. ఒకటి కాకపోతే.. ఇంకో సినిమా అయినా.. ఎక్కువ రోజులు ఆడించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకో ఏడేళ్లలో మహేశ్ తనయుడు గౌతమ్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు. అలాంటప్పుడు పెద్ద హీరో అనే ఇమేజ్ సినిమాలు ఇప్పించగలదు కానీ థియేటర్ లో ఆడించలేదు. ఈ విషయాన్ని గమనించిన నమ్రత.. మహేశ్ ని థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేసింది. సో.. ఇప్పటికైనా అర్థమైందిగా మహేశ్ థియేటర్స్ వెనుకున్న అసలు కథ.