ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొన్న మహేష్
ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఏ.ఆర్.మురుగదాస్ తో సినిమా సెట్స్ కెళ్లనుంది. అయితే ఈలోగానే ప్రిన్స్ కాంపౌండ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఖరీదైన నివాసాన్ని నిర్మించుకున్నారు. దీనికోసం ఏకంగా 20 కోట్లు పైగా ఖర్చు చేశారని అప్పట్లో ప్రచారమైంది. అయితే ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో ముంబైలో మరో ఇల్లు కొనుక్కున్నాడని తెలుస్తోంది. ముంబైలో పోష్ ఏరియాలో ఈ ఇల్లు ఉంది. దాదాపు 25 కోట్ల ఖర్చుతో దీన్ని కొనుక్కున్నారు మహేష్. సల్మాన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి నిర్మించిన బిల్డింగుల సముదాయంలోనే మహేష్ ఈ ఇల్లు కొనుక్కోవడం బాలీవుడ్ లో చర్చకు రావడం విశేషం. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ పనిలో ఉన్నారు. తన అభిరుచికి తగ్గట్టే ఓ రేంజులో ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అప్పట్లో హైదరాబాద్ ఇంటికి నమ్రత తనదైన ప్లాన్ ప్రకారమే ఇంటీరియర్ చేయించారు. ఇప్పుడు అంతకుమించిన టాప్ డిజైన్స్ తో ముంబై ఇంటిని అలంకరించనున్నారని తెలుస్తోంది.
అయితే సందట్లో సడేమియా మహేష్ ఇప్పుడిలా ముంబైలో కొత్త ఫ్లాట్ కొనడం వెనక అసలు కారణం ఏమై ఉంటుంది అన్న చర్చ సాగుతోంది టాలీవుడ్ లో? భవిష్యత్ లో బాలీవుడ్ కెళ్లే ఆలోచనలో ఉన్నాడా? అంటూ కొత్త ఆరాలు మొదలయ్యాయి. ప్రిన్స్ ఏం చెబుతాడో?