వచ్చే ఏడాదిలో మహేష్‌ ప్రయోగం..!

Update: 2018-11-13 08:11 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ఏదో ఒక కారణం వల్ల ఆయన సంవత్సరంకు ఒక్క సినిమాతోనే రాగలుగుతున్నాడు. ఈ ఏడాది ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ తర్వాత సినిమా ‘మహర్షి’ మళ్లీ వచ్చే ఏడాది సమ్మర్‌ లో రాబోతుంది. సంవత్సరం గ్యాప్‌ లో ఒక్కటే రావడంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది తన పంథాను మార్చాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

‘మహర్షి’ చిత్రం విడుదల కాకుండానే సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు మూవీ ప్రారంభం కాబోతుంది. ఒక వైపు సుకుమార్‌ తో మూవీ చేస్తూనే మరో సినిమాను కూడా మహేష్‌ చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇద్దరు యువ దర్శకులతో ఈయన చర్చలు జరుపుతున్నాడు. ఇద్దరిలో విభిన్నమైన కథతో వచ్చే వారితో సినిమా చేయాలని మహేష్‌ బాబు నిర్ణయించుకున్నాడు. ఒక వైపు సుకుమార్‌ తో భారీ బడ్జెట్‌ చిత్రం మరో వైపు యువ దర్శకుడితో ప్రయోగాత్మక చిత్రాన్ని మహేష్‌ బాబు చేయనున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఆ రెండు సినిమాల షూటింగ్‌ ను ఏకకాలంలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్‌ ఇవ్వడం వల్ల కెరీర్‌ లో చాలా తక్కువ సినిమాలు అవుతున్నాయి. అందుకే మహేష్‌ బాబు ఇకపై వరుసగా చిత్రాలు చేయాలని, ఏకకాలంలో రెండు సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈమద్య చిన్న - పెద్దా హీరో అనే తేడా లేకుండా అంతా కూడా ఒకసారి ఒకే సినిమాను చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా హీరోలు ముందుకు వెళ్తుంటే - మహేష్‌ బాబు మాత్రం తన 26 మరియు 27వ చిత్రాలను ఒకేసారి పట్టాలెక్కించాలని, ఒకే సారి చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మక నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని మహేష్‌ కు ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News