సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమ్మాయిలు పడి చస్తారు. అతడి క్రీగంటి చూపు కోసం పడిగాపులు పడతారు. తన ఆటోగ్రాఫ్ కోసం, తనతో ఫోటో దిగేందుకు , వీలుంటే డేటింగులకు ప్రపోజ్ చేసేందుకు అమ్మాయిలంతా ప్రిపేర్డ్ గా ఉంటారు. నమ్రత ఉన్నా ఇదే సీనుంది మరి. అతడి ఛరిష్మా అలాంటిది. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఛరిష్మా అతడిది. అయితే మహేష్ ని మగువలంతా ఇష్టపడతారు సరే. మరి మహేష్ ఎవరిని ఇష్టపడతాడు? ఇన్నేళ్లలో ఏరోజూ ఈ విషయం గురించి ప్రిన్స్‌ని ఎవరూ అడగనేలేదు. నమ్రత తప్ప ఇంకెవరిని ఇష్టపడతావ్ మహేష్? అని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
నేను ఎక్కువగా ఇష్టపడేది శ్రీదేవిని - నవతరం కథానాయికల్లో దీపిక పదుకొన్ అంటే చాలా ఇష్టం. పికూ మూవీలో తన యాక్టింగ్ సూపర్భ్... అంటూ పొగిడేశాడు. దీపిక బ్రిలియంట్ యాక్ర్టెస్. అంతకుమించి అందగత్తె.. అంటూ తన మనసును ఆవిష్కరించాడు. మరి అలాంటప్పుడు ఏదైనా మూవీలో నటింపజేసేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? ఒకవేళ దీపిక కాల్షీట్ల సమస్య అనుకుందాం. అయినా మునుముందు బాలీవుడ్ లో నటించే ఛాన్సుంది కాబట్టి అప్పుడు తప్పకుండా దీపిక తనకి జోడీగా నటిస్తుందేమో చూడాలి. ఎలానూ నమ్రత మహేష్ ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, అక్కడ సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దీపికతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.