పిల్లలు పుట్టినప్పుడు కాదు వారు పెరిగి పెద్ద వారు అయ్యి ప్రయోజితులు అయినప్పుడు తండ్రి సంతోషపడతాడు.. గర్వపడతాడు. మహేష్ బాబుకు అప్పుడే ఆ సందర్బం వచ్చింది. తన కూతురు సితారను చూసి గర్వపడుతున్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపించే సితార ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. సితార చదువులోను ఇతర యాక్టివిటీల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది సితారను ఇష్టపడతారు.
ఇటీవల సితార ఫ్రొజెన్ 2 సినిమాలోని బేబీ ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పింది. సితార డబ్బింగ్ తో ఒక్కసారిగా ఫ్రొజెన్ 2 సినిమా తెలుగు వర్షన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాకు సంబంధించి భారీగా పబ్లిసిటీ వచ్చింది. సితార డబ్బింగ్ చెప్పడం వల్ల ఫ్రొజెన్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్స్ లో కూడా విడుదల కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సితారకు ఇంత పేరు వచ్చినందుకు మహేష్ బాబు చాలా సంతోషిస్తున్నాడు.
మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. సితూ పాప నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నవంబర్ 22 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నీవు నిజంగా క్వీన్ ఎల్సాకు మారు రూపం అన్నాడు. హాలీవుడ్ మూవీ ఫ్రొజెన్ 2 ఇండియాలో హిందీ.. తెలుగు.. తమిళం భాషల్లో విడుదల కాబోతుంది. బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పగా.. ఎల్సా పెద్దయ్యాక ఉండే పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరి డబ్బింగ్ తో ఎల్సా పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.