జిమ్ములో స‌ర్కారు వారి వెయిట్ ఎంతంటే?

Update: 2021-07-27 11:30 GMT
టాలీవుడ్ లో ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ‌ ఇటీవ‌లి కాలంలో అమాంతం పెరిగింద‌నే చెప్పాలి. ఆరోగ్యంతో పాటు ఫిట్ లుక్ కోసం అప‌రిమితంగా శ్ర‌మిస్తున్నారు. రెగ్యుల‌ర్ వాకింగ్.. రన్నింగ్ జిమ్మింగ్ ని నేటిత‌రం హీరోలు ఎక్కుగా అనుస‌రిస్తున్నారు. జిమ్ములకు వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి వ‌ర్క‌వుట్లు చేస్తున్నారు. మ‌న‌ స్టార్లు హీరోలు మాత్రం ఫిట్ నెస్ విష‌యంలో ఎంత మాత్రం అశ్ర‌ద్ద చేయ‌రు. మ‌హేష్.. రామ్ చ‌ర‌ణ్.. అల్లు అర్జున్.. రానా.. ప్ర‌భాస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ.. రామ్  ఆ జాబితాలో ముందుంటారు.

రామ్ చ‌ర‌ణ్‌- బ‌న్ని- రానా ఫిట్ నెస్ పై ఎంత శ్ర‌ద్ధ‌గా ఉంటారో ఇప్ప‌టికే  చాలా వీడియోలు రివీల‌య్యాయి. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ జిమ్ లో వ‌ర్క‌వుట్ల‌తో బిజీగా  ఉన్న ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఒక్కో చేతిలో 20 కేజీల డంబెల్స్  వెయిట్ ని పైకి ఎత్తుతూ షేపుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. రెండు చేతుల్లో 40 కేజీల వెయిట్ సునాయాసంగా ఎత్తేస్తున్నారు. ఓ ట్రెయినర్ స‌మ‌క్షంలో మ‌హేష్ ఇవ‌న్నీ చేస్తున్నారు.  ఈ లుక్ లో మ‌హేష్ కి లైట్ గా గెడ్డం...పోడ‌వైన గిర‌జాల‌ జుట్టు కనిపిస్తోంది.

మ‌హేష్ ఫిలింన‌గ‌ర్ ఇంట్లోనే జిమ్ చేస్తున్నారు. రెగ్యుల‌ర్ గా ఈ జిమ్ లోనే వ్యాయామాలు చేస్తుంటారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ఎక్కువ స‌మ‌యాన్ని అవ‌స‌రం మేర జిమ్ లో గ‌డుపుతున్న‌ట్లు కూడా ఓ సంద‌ర్భంలో మ‌హేష్ ట్వీట్ చేసారు.  ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో  `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది  భాగం షూటింగ్ పూర్త‌యింది.  బ్యాలెన్స్ షూట్ కూడా పూర్తి చేసి వీలైనంత‌ త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా త్రివిక్ర‌మ్- రాజ‌మౌళి తోనూ మ‌హేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నారు.
Tags:    

Similar News