ఏప్రిల్ 27 టార్గెట్ తో చకచకా పనులు పూర్తి చేసుకుంటున్న మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై.. కొన్ని రోజుల క్రితం సందేహాలు ఉన్నాయి.. మే నెలకు వాయిదా పడిందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఈ సినిమాను ఏప్రిల్ 27కే విడుదల చేసే లక్ష్యంతో.. చకచకా షూటింగ్ చేసేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయి.
భరత్ అనే నేను మూవీకి షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయిపోయిందట. ఒక్క హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రమే ఇంకా చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పాటను సూపర్బ్ అనిపించే విధంగా.. ప్లాన్ చేశాడట దర్శకుడు కొరటాల శివ. యూకేలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే మహేష్ అండ్ టీం లండన్ బయల్దేరనున్నారని తెలుస్తోంది. ఈ పాట ఒక్కటి కంప్లీట్ చేస్తే.. ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఏమీ ఉండదని అంటున్నారు. దాదాపు 2 నెలలకు ముందే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేయడం విశేషం.
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా మహేష్ చురుగ్గా పాల్గొంటున్నాడని అంటున్నారు. టెక్నికల్ టీంతో సన్నిహితంగా మెలుగుతూ.. వారిలో ఉత్సాహం నింపుతున్నాడట. మార్చి డెడ్ లైన్ పెట్టినట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ చిత్రం కథాకథనాలపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న మహేష్ బాబు.. ఈ చిత్రం ద్వారా మళ్లీ సక్సెస్ రూట్ లోకి రాగలనని నమ్మకంగా ఉన్నాడు.