మహేష్ ఏజ్ రోజురోజుకి తగ్గుతోందబ్బా

Update: 2017-01-28 11:27 GMT
మహేష్ బాబు టాలీవుడ్ మొత్తానికి అందగాడు అనడంలో సందేహం అక్కర్లేదు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ తన వయసును.. లుక్ ని స్టడీగా మెయింటెయిన్ చేయడమే కాదు.. రోజురోజుకు ఈ సూపర్ స్టార్ ఏజ్ తగ్గిపోతోందా అనిపించక మానదు.

ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో అదరగొట్టే సూపర్ స్టార్.. ఇప్పుడు మురుగదాస్ సినిమాలో అయితే.. తన కొత్త అవతారంతో అమ్మాయిలకు నిద్ర లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మురుగదాస్ సినిమాలో మహేష్ బాబు లుక్ కి సంబంధించిన ఓ లుక్ లీక్ అయింది. వైట్ షర్ట్.. మెరూన్ కలర్ ప్యాంట్ లో సూపర్బ్ గా ఉన్నాడు మహేష్. చక్కగా టక్ చేసి.. బ్లాక్ షూస్ తో ఉన్న ఈ అందగాడి లుక్ అదిరిపోయింది.

నలభై ఒక్క ఏళ్ల వయసులో కూడా టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇంతకీ తన వయసు తగ్గించేసుకోవడానికి మహేష్ ఏం చేస్తున్నాడనే విషయం మాత్రం ఇంకా సస్పెన్సే. కానీ తన లుక్స్ తో మాత్రం మహేష్ బాబు చంపేస్తున్నాడబ్బా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News