వంశీ, సుకుమార్‌ మధ్యలో మరో సినిమాకు మహేశ్‌ ప్లాన్‌.!

Update: 2018-12-29 01:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ప్రస్తుతం మహర్షి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సమ్మర్‌ కు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. సమ్మర్‌ రిలీజ్‌ అంటే.. మహేశ్‌ మార్చికే ఫ్రీ అయిపోతాడు. అంటే మార్చి నుంచి తన తర్వాతి సినిమా మొదలు పెట్టాలి. అయితే.. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మహేశ్‌ తన తర్వాతి సినిమాను సుకుమార్‌ తో చేస్తున్నాడు. కానీ సుకుమార్‌ ఇంత వరకు కథని సిద్ధం చేయలేదు. కథను సిద్ధం చేసేందుకు వచ్చే ఏడాది నవంబర్‌ వరకు పడుతుందని ఆల్‌ రెడీ చెప్పేశాడు. మరి ఇప్పుడు ఎలా..? అందుకే మహేశ్‌ ఈ గ్యాప్‌ లో మరో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు.

మహేశ్‌ తో సినిమా అంటే మినిమంలో 9 నెలలు పడుతుంది. ఖలేజా సినిమాకు అయితే ఏకంగా 3 ఏళ్లు తీసుకున్నాడు. ఇప్పుడా పద్ధతిని మార్చి.. మూడు నెలల్లో సినిమాను కంప్లీట్‌ చేసి దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. దీనివల్ల.. సమ్మర్‌ లో ఒక సినిమా, దసరాకు ఒక సినిమా రిలీజ్‌ అవుతుంది. అంటే ఏడాదికి రెండు సినిమాలన్నమాట. ఇప్పటికే మహేశ్‌ ని కలిసి కొంతమంది దర్శకులు కథలు కూడా చెప్పేశారు. అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి, ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి లాంటి వాళ్లు లిస్ట్‌ లో ఉన్నారు. మరి మహేశ్‌ అద్భుతమైన దసరా ఆఫర్‌ ఈసారి ఎవరికి దక్కుతుందో. 
Tags:    

Similar News