గత ఏడాది "అఆ" సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ ఈ ఇయర్ కూడా "లై" సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ నెల 11 న విడుదలకు రెడీ గా ఉన్న ఈ సినిమా ఆడియో లాంచ్ ను శుక్రవారం గ్రాండ్ గా చేశారు చిత్రం యూనిట్ సభ్యులు. చాలా రోజుల తర్వాత మంచి ఆఫర్ ని దక్కించుకున్న మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడులే.
అయితే వ్యక్తికగతంగా ఈ సినిమా హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే.. నితిన్ గత సినిమాల ఆడియో వేడుకలకు పవన్ కూడా హాజరయ్యే వారు. కానీ ఈ సారి "లై" పాటల వేడుకలో మహేష్ బాబు గెస్ట్ గా వస్తున్నారని తెలియడంతో అందరిలో కొంత ఆసక్తిని రేపింది. ఎందుకంటే 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ తో మహేష్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. వారు ఆయనతో మూడు సినిమాలను తెరకెక్కించి బాగా దగ్గరయ్యరు. దీంతో ఆ సంస్ధ నిర్మించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాద ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ ని గెస్ట్ గా పిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వారు నిర్మించిన లై చిత్రానికి మహేష్ ని గెస్ట్ గా రప్పించాలని అనుకున్నారు. కానీ ఆయన రాకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ - సుకుమార్ ల చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేశారు. దీంతో కొంతమంది మహేష్ అభిమానులు కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
మొదట పవన్ కళ్యాణ్ వస్తున్నడని వార్తలు వచ్చినా అది అవాస్తవం అని తేలిపోయింది. కానీ మహేష్ వస్తున్నాడని ప్రచారం జోరుగా సాగడంతో 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ రామ్ అచంట - గోపిచంద్ అచంట - అనిల్ సుంకరలు మహేష్ ని రప్పించడానికి బాగానే ప్లాన్ వేశరట కానీ చివరికి 1 నేనొక్కడినే దర్శకుడు అయిన సుకుమార్ ని పిలిచి సరిపెట్టుకుంది. ఇక నితిన్ తన తరపునుంచి "అఆ" సినిమా దర్శకుడైన త్రివిక్రమ్ ని పిలిచి పవన్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇంతకీ మహేష్ ఎందుకు రాలేదు?