సినిమా సిఎంలు సక్సెస్ అవుతారా
ఏదైనా సినిమాలో హీరో ముఖ్య మంత్రి పాత్ర పోషించడం అంటే చిన్న విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మన హీరోలు ఆ సాహసాన్ని చేయడానికి అంతగా ఇష్టపడరు. ఇప్పుడు మహేష్ బాబు భరత్ అనే నేనుతో 24వ సినిమాలోనే సిఎంగా నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పాత్రలో కథానాయకుడు కనిపించడం రానా పరిచయమైనా లీడర్ లో చూసాం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. కాని టాలీవుడ్ ట్రెండ్ ని బాగా గమనిస్తే ముఖ్య మంత్రి పాత్రలు చేసిన హీరోలు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అంతదాకా ఎందుకు. నూట యాభై సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఒక్క ముఠా మేస్త్రిలో మాత్రమే మినిస్టర్ గా కనిపిస్తారు తప్ప సిఎంగా కాదు. ఇక వంద మార్క్ దాటేసిన బాలయ్య ఇంతవరకు మంత్రిగా గా సైతం ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఇక విక్టరీ వెంకటేష్ - కింగ్ నాగార్జున వీటి జోలికి వెళ్ళనే లేదు. రాజశేఖర్ ఎవడైతే నాకేంటి సినిమాలో ప్రయత్నిస్తే అది మంచి ఫలితమే ఇచ్చింది. జగపతి బాబు అధినేత మూవీలో ముఖ్య మంత్రిగా మెప్పించాడు. నాగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ ని ప్రభావితం చేసే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాడే తప్ప సిఎంగా కాదు. ఇక పవన్ కళ్యాణ్ అసలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీనే చేయలేదు. ఈ రకంగా చూసుకుంటే మహేష్ చాలా కొత్త జానర్ ట్రై చేస్తున్నట్టే అనుకోవాలి. శంకర్ తీసిన ఒకే ఒక్కడు ఇప్పటి దాకా హీరో సిఎంగా వచ్చిన సినిమాల్లో ది బెస్ట్. కాని అది మనకు డబ్బింగ్ లెక్కలోకి వస్తుంది కాబట్టి టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల పరంగా మహేష్ 'భరత్ అనే నేను'తో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు అనే చెప్పాలి.
ఏ స్టార్ హీరో సినిమా అయినా ముఖ్య మంత్రి పాత్రలను ఎవరో ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ తో వేయించి మమ అనిపించడం చూసాం కాని మహేష్ లాంటి స్టేచర్ ఉన్న హీరో చేయటం మాత్రం ఈ మధ్యకాలంలో జరగలేదు. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారు విజయనిర్మల గారి దర్శకత్వంలో ముఖ్యమంత్రి అనే పేరున్న సినిమాలో నటించారు. ప్రజా ప్రతినిధి - నా పిలుపే ప్రభంజనం లాంటి పొలిటికల్ మూవీస్ ఎన్నో చేసారు. అన్ని విజయం సాధించినవే. యువత రాజకీయాల్లోకి రావాలి అన్న నినాదం బలంగా మారడం కోసం భరత్ అనే నేను లాంటి సినిమాల అవసరం చాలా ఉంది.