పెద్ద హీరోల సినిమాలకు ముందు చాలా హడావుడి ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సినిమాలంటే ఉండే సందడే వేరు. ఆ హంగామాను ఆస్వాదించడానికి అభిమానులు తహతహలాడిపోతుంటారు. అందులోనూ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయిన ఈ రోజుల్లో విడుదలకు ముందు రెండు మూడు వారాల సమయాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఇంతకుముందు లాగా హీరోలు కూడా మడికట్టుకుని కూర్చోకుండా ప్రమోషన్లు పెద్ద స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో సందడి మరింత ఎక్కువగా ఉంటోంది. ఐతే ‘బ్రహ్మోత్సవం’ సినిమా విషయంలో ఆ సంబంరాలకు పెద్దగా టైం ఇవ్వలేదు.
మహేష్ గత సినిమా ‘శ్రీమంతుడు’ రిలీజ్ డేట్ నెలన్నర ముందే ఖరారైపోయింది. మూడు వారాల ముందు నుంచి ప్రమోషన్లు మొదలయ్యాయి. మీడియాలో ఎక్కడ చూసినా సినిమా విశేషాలే కనిపించాయి. మహేష్ బాబు సైతం సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేశాడు. ఆ సినిమాకు మాంచి హైప్ వచ్చింది. అభిమానులు కూడా విడుదలకు ముందు వాతావరణాన్ని బాగా ఆస్వాదించారు. కానీ ‘బ్రహ్మోత్సవం’ విషయంలో రెండు వారాల టైం కూడా లేదు. చాలా హడావుడి అయిపోతోంది. ప్రమోషన్లు కేవలం వారం రోజులే నడిచేలా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ హడావుడి మధ్య ప్రమోషన్ ఏమాత్రం చేస్తారో చూడాలి. బ్రహ్మోత్సవం లాంటి భారీ తారాగణమున్న సినిమాకు ప్రమోషన్ చాలా గ్రాండ్ గా చేయొచ్చు. థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. కానీ కేవలం 13 రోజుల ముందు రిలీజ్ డేట్ ఖరారవడంతో షార్ట్ నోటీస్ అయిపోయింది. అంతా హడావుడిగా అయ్యేు పరిస్థితి కనిపిస్తోంది.