క్రికెట్ ఆట‌లోనూ స‌రిలేరు నీకెవ్వ‌రు

Update: 2019-08-10 06:34 GMT
షూటింగ్ స‌మ‌యంలో బ్రేక్ దొరికితే ఎవ‌రైనా ఏం చేస్తారు?  సూప‌ర్ స్టార్  మ‌హేష్ అయితే ఏం చేస్తారు?  మిగ‌తా వాళ్ల మాటేమో కానీ.. ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో ప‌ర‌కాయం చేస్తున్న‌ మ‌హేష్ అయితే క్రికెట్ ఆటలో నిమ‌గ్న‌మ‌య్యారు. షూట్ బ్రేక్ లో బాల్ బ్యాట్ ప‌ట్టుకుని మైదానంలోకి దిగారు. బంతుల్ని బౌండ‌రీలు దాటించేశారు.  బౌలింగ్ కూడా చేశారు. ఈ ఆట‌లో మాష్టర్ గౌత‌మ్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఇదేచోట క్యూట్ సితార ప్రేక్ష‌కురాలు పాత్ర పోషించింది. గౌత‌మ్ కూడా బెస్ట్ బౌల‌ర్ అని అక్క‌డ ఆట‌తీరు చెప్పింది.

ఇంత‌కీ ఈ ఆట ఎక్క‌డ ఆడారు? అంటే అప్ప‌ట్లో క‌శ్మీర్ షెడ్యూల్ చేసేప్పుడు ఇలా తీరిక స‌మ‌యం చిక్కింద‌ట‌. మహేష్ తో పాటు  మెహ‌ర్ ర‌మేష్.. వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు క్రికెట్ ఆడుతూ క‌నిపించారు. మ‌హేష్ బ్యాట్ చేత ప‌ట్టిన మ‌హేష్ బంతిని బౌండ‌రీలు కొట్టేందుకు రెడీ అయిన వైనం ఆ వీడియోలో ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోని అనీల్ రావిపూడి స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతోంది.

ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు టీమ్ క‌శ్మీర్ షెడ్యూల్ ముగించి హైద‌రాబాద్ షెడ్యూల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ట్రైన్ సెట్ లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నిన్న‌(ఆగ‌స్టు 9న‌) ఆర్మీ మేజ‌ర్ లుక్ తో ఇంట్రో టీజ‌ర్ ని రిలీజ్ చేస్తే అది ఇప్ప‌టికే జోరుగా వైర‌ల్ అయ్యింది. దాదాపు 90ల‌క్ష‌ల‌ మంది వీక్షించారు. సంక్రాంతి రిలీజ్ ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి - దిల్ రాజు- అనీల్ సుంక‌ర బృందం శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.


For Video Click Here


Tags:    

Similar News