చై గేమ్ ఛేంజర్.. సాయిపల్లవి ఎముకల్లేవ్!- మహేష్
అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `లవ్ స్టోరి` ఈనెల 24న విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి వీకెండ్ కలెక్షన్లలోనూ `లవ్ స్టోరి` రికార్డులు బ్రేక్ చేయనుందని సమాచారం.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీని వీక్షించి ప్రశంసల జల్లు కురిపించారు. నాగచైతన్య - కమ్ముల సహా సాయి పల్లవిని ప్రశంసల్లో ముంచెత్తారు. నిర్మాత నారంగ్ కి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కొన్ని వరుస ఎమోషనల్ ట్వీట్లతో హీటెక్కించారు.
శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. చైతూ నటుడిగా చాలా ఎదిగాడు. అతడికి ఈ సినిమా గేమ్ ఛేంజర్ కానుంది. వ్వాటే పెర్ఫామెన్స్..! అంటూ ప్రశంసించారు.
సాయిపల్లవి అన్నివేళలా సంచలనమే. అసలు ఈమెకు ఎముకలు ఉన్నాయా? ఇంత గొప్పగా డ్యాన్సులు చేసేవాళ్లను నేను ఎక్కడా చూడలేదు. పెద్ద తెరపైనా చూడలేదు.. అంటూ సాయిపల్లవి డ్యాన్సులను ఆకాశానికెత్తేశారు. ఇక పవన్ మ్యూజిక్ జస్ట్ సెన్సేషన్ అంటూ కితాబిచ్చారు. రెహమాన్ సర్ రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నాను. ఆయనకు గర్వం కలిగించేలా నువ్వు పని చేశావ్.. అని టీమ్ ని ప్రశంసించారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్- పుస్కర్ రామ్ మోహన్ రావు లకు అభినందనలు తెలియచేశారు.