భరత్ అనే నేను మూవీలో యంగ్ అండ్ స్మార్ట్ సీఎంగా కనిపించి మహేష్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ముందుకు వరస ఫ్లాపులతో సతమతమైన మహేష్ కు డైరెక్టర్ కొరటాల శివ ఊరటనిచ్చాడు. కెరీర్ లో ఇంతవరకు 24 సినిమాలు పూర్తి చేసి కీలకమైన 25వ సినిమా మైలురాయికి చేరుకున్న మహేష్ కు భరత్ అనే నేను హిట్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
ఇదే ఊపుతో 25వ సినిమా స్టార్ట్ చేసేశాడు టాలీవుడ్ ప్రిన్స్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ కోసం గడ్డం.. జుట్టు పెంచి ఓ కొత్త లుక్ లో కనిపించాడు. ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. ముందే మహేష్ తో సినిమా తీసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న ప్రొడ్యూసర్ పీవీపీ డేట్లు తనకు ఇవ్వకపోవడంపై ఆగ్రహించాడు. దీనిపై లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. మరోవైపు వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూడా చాలారోజుల క్రితమే అడ్వాన్స్ ఇచ్చి వెయిటింగ్ లో ఉన్నాడు. దీంతో ఈ వీళ్ల ముగ్గురి మధ్య క్లాష్ వచ్చింది. దాంతో వాళ్లు ముగ్గురినీ ఓచోట కూర్చోబెట్టి వ్యవహారం సెటిల్ మెంట్ చేశారు.
ఈ సెటిల్ మెంట్ ప్రకారం మహేష్ 25వ మూవీని ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి నిర్మిస్తారు. లాభాలు సమానంగా పంచుకుంటారు. దీంతోపాటు బడ్జెట్ కూడా లిమిటేషన్ లో ఉండాలని డిపైడయ్యారు. దీంతో ప్రిన్స్ రాజీ పడాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ లో సగం కన్నా తక్కువే తీసుకుంటున్నాడని తెలిసింది. వివాదాలతో తలనొప్పులు తెచ్చుకోవడం కన్నా కాస్త పేమెంట్ తగ్గినా ఫర్వాలేదన్నట్టుగా మహేష్ ఫీలయ్యాడనేది టాలీవుడ్ టాక్. ప్రస్తుతం మూవీ షూటింగ్ నార్త్ లో జోరుగా సాగుతోంది.