మహేష్ బాబు సర్కారు వారి పాట వసూళ్లను నిలబెట్టేందుకు నిర్మాతలు.. చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు సర్కారు వారి పాట సినిమాకు విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా దాన్ని తట్టుకుని దానికి పోటీ గా పాజిటివ్ ప్రచారం చేస్తూ సర్కారు వారి పాట కు జనాలను రప్పించడంలో నిర్మాతలు ఒక మేరకు సఫలం అయ్యారు.
సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు మరియు థమన్ లు మాట్లాడుతూ సినిమాలోని మురారి బావ అనే పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థమన్ ట్యూన్ చేసిన మురారి బావ పాట కూడా చాలా బాగా వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా కు దాన్ని జోడించలేదని మహేష్ బాబు ఇంటర్వ్యూలో చెప్పాడు
సినిమాలో చూపించలేక పోయిన మురారి బావ పాటను యూట్యూబ్ ద్వారా అయినా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ మహేష్ బాబు హామీ ఇచ్చాడు. ఆ హామీ ని మహేష్ బాబు ఎప్పుడెప్పుడు నిలుపుకుంటాడా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఆ పాటను థియేట్రికల్ వర్షన్ లో జోడించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మహేష్ బాబు యూట్యూబ్ లో విడుదల చేయాలనుకున్న పాటను మురారి బావ పాట థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. యూట్యూబ్ లో కంటే కూడా థియేటర్ లో చూడటం కోసం చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు ల మమ మహేశా పాట ఓ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ను ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులను అలరిస్తూ ఉంది. కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు డాన్స్ లతో కుమ్మేశారు. మురారి బావ పాటలో కూడా ఇద్దరు పోటీ పడి మరీ డాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు అభిమానులు మురారి బావ పాట కోసం ఎదురు చూస్తున్నారు.
నేడు సినిమా సక్సెస్ మీట్ ను కర్నూలు లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా సర్కారు వారి పాట లో మురారి బావ పాటను యాడ్ చేయడం పై స్పష్టత ఇవ్వడం జరుగుతుంట. ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా మురారి బావను థియేటర్లలో అభిమానులు మరియు సినీ ప్రేమికులు చూడబోతున్నారు.