సర్కారు వారి పాట సినిమా బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టర్ అని తొలి రోజు నుంచి ఊదరగొట్టేస్తోంది చిత్ర బృందం. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. రెండో రోజు వసూళ్లు బాగా తగ్గినా.. శని, ఆదివారాల్లో కలెక్షన్లు పుంజుకున్నాక సోమవారం నుంచి ఒక్కసారిగా బాగా డ్రాప్ కనిపించినా.. నిర్మాతలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. భారీ కలెక్షన్ల ఫిగర్లతో పోస్టర్లు దించుతూనే వచ్చారు. వీకెండ్ తర్వాత వసూళ్లు పడిపోకుండా హడావుడిగా పెద్ద స్థాయిలో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది.
సోమవారం నుంచి వసూళ్లు అంతకంతకూ పడుతూనే వచ్చాయి. బుధ, గురు వారాల్లో అయితే కలెక్షన్లు మరీ దారుణంగా వచ్చాయి. యావరేజ్ ఆక్యుపెన్సీ 20 శాతానికి మించని పరిస్థితి. చాలా చోట్ల మినిమం ఆక్యుపెన్సీ లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది నైజాం ఏరియాలో. వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నా కలెక్షన్లు పెంచి పెంచి పోస్టర్లు వేస్తూనే పోయారు.
రెండో వీకెండ్లో సినిమా పుంజుకుంటుందని అనుకున్నారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఈ వారం శేఖర్ మినహా చెప్పుకోగ్గ రిలీజ్‌లు లేవు. దాని పట్ల కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నప్పటికీ సర్కారు వారి పాట పెద్దగా ఉపయోగించుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చే వారం రిలీజ్ కానున్న ఎఫ్-3 కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు.
టికెట్ల రేట్లు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో డిడైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది. ఇప్పటిదాకా చూస్తే సర్కారు వారి పాట షేర్ రూ.90 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. తొలి వారాంతంలో రూ.80 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వచ్చిన ఈ చిత్రం.. ఆ తర్వాత నామమాత్రపు షేర్ వసూలు చేస్తోంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల విలువ రూ.125 కోట్లు కావడం గమనార్హం. ఫుల్ రన్లో కనీసం రూ.30 కోట్ల మేర నష్టం తప్పేలా కనిపించడం లేదు. అంత నష్టం అంటే సినిమాను డిజాస్టర్ అనాలే తప్ప.. బ్లాక్‌బస్టర్ అని ఎలా అంటాం?