కోటిన్నర సెట్లో 80 మందితో ఆట

Update: 2017-06-30 07:16 GMT
కోటిన్నర సెట్లో 80 మందితో ఆట
  • whatsapp icon
మహేశ్ బాబు ‘స్పైడర్’  సినిమా ఒక కొలిక్కి వచ్చినట్లే అనిపిస్తోంది. ఇకపోతే ఇప్పుడు మరోసారి స్పైడర్ షూటింగ్ మొదలుకానుంది. కొద్ది నెలలుగా వస్తున్న అన్ని వార్తలును ఆ చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. మహేశ్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘భారత్ అనే నేను’ సినిమా షూటింగ్లో బిజీ గా ఉన్నాడు. మరి వచ్చే వారం లో మళ్ళీ స్పైడర్ షూటింగ్ మొదలుకాబోతుంది అది ఏంటి అనుకుంటున్నారా కంగారుపడకండి..

ఇంకా కొంత టాకీ భాగం షూట్ చేయవలిసి ఉంది అందుకే మహేశ్ మళ్ళీ స్పైడర్ కోసం షూటింగ్ వెళ్తున్నాడు అని పుకారులు వచ్చాయి. కాని వాటిపై మురుగుదాస్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు మహేశ్ వెళ్తుంది స్పైడర్ షూటింగుకే కానీ ఆ సినిమాలో చివరి రెండు పాటల షూటింగ్ కోసం. దీనిలో ఒక పాట కోసం 80 మంది డాన్సర్లు తో సుమారుగా ఒక కోటిన్నర ఖర్చు పెట్టి నిర్మించిన సెట్లో తీస్తున్నట్లు టాక్. ఈ పాట కోసం భారీ సెట్ కూడా వేశారట. జూలై 4 నాడు ఈ పాట షూటింగ్ జరుగుతుంది అని చెబుతున్నారు. ఆ మధ్యన 1నేనొక్కడినే సినిమాలో తన డ్యాన్సుతో కొత్త రకంగా మెస్మరైజ్ చేసిన మహేష్‌ ఇప్పుడు కూడా డ్యాన్స్ పరంగా కొత్తగా ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.

ఇప్పటివరకు స్పైడర్ విషయంలో షూటింగ్ వలనో వి‌ఎఫ్‌ ఎక్స్ పనులు జాప్యం వలనో తేదీలు మార్చుతు వచ్చారు. సినిమా పనులు అన్నీ పూర్తికావడం తో ఒక్క ఈ  రెండు పాటలు షూటింగ్ మిగిలిఉండటంతో స్పైడర్ సినిమాను ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ 27 నాడు విడుదల చేస్తాము అని చెబుతున్నారు స్పైడర్ చిత్ర బృందం. ఇదండీ తాజా అప్డేట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News