నిజంగా పోకిరి స్క్వేర్ అవుతుందా?

Update: 2019-05-19 06:37 GMT
నిన్న విజయవాడలో జరిగిన మహర్షి గ్రాండ్ సక్సెస్ మీట్ సందర్భంగా మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఓపెన్ అయ్యాడు. పాతికవ సినిమాగా మహర్షి గురించి తానెంత స్పెషల్ గా ఫీలవుతున్నది మరోసారి విడమర్చి చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా తక్కువగా మాట్లాడినా ఉన్నదాంట్లోనే చాలా విషయాలు చెప్పేశాడు. ముఖ్యంగా ఓ విషయం మాత్రం టాపిక్ గా మారింది.

డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇది పోకిరి స్క్వేర్ అవుతుందని దర్శకుడు వంశీ పైడిపల్లితో అన్నానని ఇప్పుడది నిజమైందని చెప్పాడు. ఇది అభిమానులకు మంచి కిక్కిచ్చే మాట కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే మహర్షి నిజంగా పోకిరిని తలదన్నే సీన్ ఉందా అంటే వాళ్లే మనస్పూర్తిగా ఔను అనలేరు. కారణాలు లేకపోలేదు.

కలెక్షన్స్ పరంగా మహర్షి పోకిరిని దాటి ఉండవచ్చు. అంత మాత్రాన ఇదే బెస్ట్ అని చెప్పడానికి లేదు. మొదటి వారం మహర్షి టికెట్ రేట్లు మల్టీ ప్లెక్సులు పెద్ద స్క్రీన్లలో 150 నుంచి 200 దాకా అమ్మారు. పోకిరి టైంలో అప్పర్ క్లాస్ టికెట్ ధర గరిష్టంగా 70 రూపాయలు. సో లెక్కల పోలిక కరెక్ట్ కాదు. పోకిరి చాలా జెన్యూన్ గా సిల్వర్ జూబిలీ ఆడింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా మహర్షి కనీసం యాభై రోజులు డెఫిషిట్ లేకుండా ఆడుతుందా అంటే ట్రేడ్ నుంచి మౌనమే సమాధానం.

సో మహర్షిలో ఎంత సందేశం ఇచ్చినా పబ్లిక్ ఎంతగా కనెక్ట్ అయినా కాకపోయినా పోకిరి రేంజ్ తో పోల్చడం కానీ దాన్ని దాటేసింది అని చెప్పడం కానీ అతిశయోక్తే అవుతుంది. సరే తన ట్వంటీ ఫిఫ్త్ మూవీ కాబట్టి మహేష్ కు ఆ మాత్రం ఎగ్జైట్ మెంట్ సహజం కాబట్టి దాన్ని ఇంత కంటే లోతుగా విశ్లేషించలేం కాని పోకిరి సాధించిన కల్ట్ స్టేటస్ ని మహర్షి దక్కించుకుంటుందా అంటే ఇంకొద్ది రోజులు ఆగి చూడాల్సిందే.


Tags:    

Similar News