మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. స్పై-డర్ అనే టైటిల్ ను తెలుగు.. మలయాళ.. హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేయించేశారు నిర్మాతలు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్.. టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే.. ప్రాబ్లెం ఎక్కడొస్తుందంటే.. తమిళ్ వెర్షన్ తోనే. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ.. తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోందనే సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ ఒకటే టైటిల్ ఉండేలని మహేష్ పట్టు పట్టడంతోనే.. ఇన్ని నెలల పాటు ఫస్ట్ లుక్ కూడా ఇవ్వకుండా మహేష్ ని దాచేశారు. కానీ ఇప్పుడు స్పై-డర్ అనే టైటిట్ కి తమిళ నిర్మాతలు ఒప్పుకునే అవకాశం ఉండదు. అక్కడ తమిళ పేరుతో టైటిల్ ఉంటేనే.. సినిమాకి 100 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. కానీ స్పై-డర్ అనే ఇంగ్లీష్ పేరు పెడితే.. ఆ పన్ను రాయితీలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే తంబీలు ఈ టైటిల్ కు నో చెప్పే ఛాన్సుంది.
ఇది నిర్మాతలకు భారీగానే నష్టపరిచే అంశం. అందుకే మహేష్ మూవీ తమిళ్ వెర్షన్ కు స్పై-డర్ అనే టైటిల్ ఉండకపోవచ్చు. అందుకు తగ్గట్లుగానే.. స్పై-డర్ టైటిల్ ను తెలుగు- మలయాళ-హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేశారు కానీ.. తమిళ నిర్మాతలు మాత్రం చేయలేదని అంటున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం రెండు భాషల్లో ఒకటే టైటిల్ అనే విషయంలో మహేష్ అయినా తగ్గాలి.. లేకపోతే కొత్త టైటిల్ వెతుక్కోవాలి. ఏం జరగనుందో.. నాలుగు రోజులు ఆగితే తెలిసిపోతుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/