శ్రీమంతుడు మీద ఆ భారం ఉంది

Update: 2015-07-18 03:56 GMT
ఏదైనా ఒక బ్లాక్‌బస్టర్‌ సినిమా వచ్చినప్పుడు.. ఇక ఆ సినిమాను తలదన్నే సినిమా ఒక్కటి కూడా అప్పుడే రాదేమో అనిపిస్తుంటుంది. అప్పట్లో పోకిరి వచ్చినప్పుడు, తరువాత మగధీర రిలీజయ్యాక, ఆ మధ్యన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్‌ అయినప్పుడు అందరూ ఇదే ఫీలింగ్‌తో ఉన్నారు. అయితే ప్రతీసారి ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్‌ వచ్చినప్పుడల్లా వెంటనే ఆ ఫీవర్‌ తాలూకు సెగలను మర్చిపోయేలా చేయడానికి వెనుకాలే ఏదో ఒక హిట్‌ సినిమా ఉండనే ఉంటుంది.

ప్రస్తుతం మహేష్‌ బాబు హీరోగా రూపొందిన ''శ్రీమంతుడు'' సినిమాది సేమ్‌ పొజిషన్‌. ఆల్రెడీ ఎక్కడ చూసినా ఇండయిన్‌ బాక్సాఫీస్‌ అంతా బాహుబలి ఫీవర్‌తో నిండిపోయింది. మన తెలుగులో అయితే మరీనూ. రాజమౌళి చెక్కిన ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా రికార్డులన్నీ కొల్లగొట్టేసిందంటూ ఒక్కటే ప్రచారం. అయితే బాహుబలి స్థాయి సినిమా ఖచ్చితంగా రికార్డులు బ్రేక్‌ చేస్తుందని అందరికీ  తెలుసు. ఇక అలాంటి సినిమాలు రావాలంటే మూడేళ్లకు ఒకటి వస్తుంది కాని, రెగ్యులర్‌ గా పాజిబిలిటీ లేదని కూడా అందరికీ తెలుసు. కాని స్టిల్‌ బాహుబలి టాపిక్‌ వచ్చిందంటే చాలు జనాలు పూనకంతో ఊగిపోతున్నారు.

ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఆడియన్స్‌ను నార్మల్‌ సినిమా లోకానికి తీసుకెళ్ళాలంటే మన మహేష్‌ సినిమా రావల్సిందే. సినిమాకు ఒక 70 కోట్లు వచ్చినా 80 వచ్చినా కూడా.. ముందు అసలు బాహుబలి కాకుండా వేరే సినిమాలు కూడా ఉన్నాయ్‌ అంటూ ఆడియన్స్‌ ఆ ట్రాన్స్‌ నుండి బయటకు వచ్చేస్తారు. ఒక ఇండస్ట్రీ హిట్టు వచ్చినప్పుడు ఆ మాయ లోనుండి బయటకు రావడానికి ఇలా ఎవరో ఒక శ్రీమంతుడు రావల్సిందే మరి.
Tags:    

Similar News