ఓ అంచనా ప్రకారం.. భారీ వార్షికాదాయం ఆర్జించే స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ దేశంలోనే టాప్ 20 పొజిషన్ లో ఉంటాడని ఇదివరకూ ఫోర్బ్స్ లిస్ట్ తెలియజేసింది. సినిమాల ద్వారా వచ్చే పారితోషికాలకు - వాణిజ్య ప్రకటనల రూపంలో వచ్చే పారితోషికాలు అదనం. బాలీవుడ్ లో ప్రముఖ స్టార్లతో ప్రకటనలు చేయించుకునే కార్పొరెట్ కంపెనీలన్నీ సౌత్ వైపు చూడాల్సి వస్తే ముందుగా మహేష్ ని కాంటాక్ట్ చేయాల్సిందే.
ముంబైలో ఆ రేంజులో పీఆర్ రిలేషన్ ని మెయింటెయిన్ చేస్తుంటారు మహేష్ భార్య నమ్రత. పైగా బాలీవుడ్ స్టార్లకే మతిచెడే గ్లామర్ - కరిష్మా ఉన్న హీరోగా మహేష్ పేరు ఉత్తరాదినా మార్మోగిపోవడంతో అతడు సౌత్ ఆడియెన్ కి చేరువయ్యే చుక్కానీ అని కార్పొరెట్ కంపెనీలు భావిస్తుంటాయి. ఇప్పటికే డజను ప్రకటనల్లో నటిస్తూ భారీ కాంట్రాక్టులు కుదుర్చుకున్న మహేష్ ఇదివరకూ ఫేమస్ కోక్ కంపెనీ థమ్సప్ ప్రకటనలోనూ నటించారు. బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి ఆ ప్రకటన రూపొందించారు. అయితే ఇది బుల్లితెరపై ఇప్పటికే జనాలకు బోర్ కొట్టింది కాబట్టి, కొత్త లుక్ ఉన్న ప్రకటనతో మరోసారి కొంగొత్తగా ముందుకు రావాలని థమ్సప్ బృందం భావిస్తోందిట. కాంట్రాక్ట్ ప్రకారం.. మరోసారి మహేష్ థమ్సప్ యాడ్ లో నటించాల్సి ఉంటుంది. ఈసారి కూడా రణవీర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడుట. ఇక పాత థమ్సప్ యాడ్ స్థానంలో కొత్త యాడ్ వస్తుంది. అందులో మహేష్- రణవీర్ లను మరింత ఎనర్జిటిక్ గా చూపిస్తారేమో చూడాలి