చిరు చెప్పింది నిజమే కానీ.. వాస్తవం వేరేలా ఉందే

Update: 2020-01-08 09:41 GMT
స్టార్ హీరోలు తమ సినిమాలకు ముందే రెమ్యూనరేషన్లు తీసుకోవడం మంచిదా.. లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా లాభాల్లో వాటా తీసుకోవడం మంచిదా? ఇండస్ట్రీ చల్లగా ఉండాలంటే మాత్రం సినిమా హిట్ అయిన తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవడమే మంచిది అంటుంటారు. కానీ ఇలా చేసే హీరోలు అతి కొద్దిమందే.. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ఇలాంటి ఇలాంటి పద్ధతే ఫాలో అవుతుంటారు. తెలుగులో కూడా ఈమధ్య కొందరు స్టార్లు అదే పద్దతి ఫాలో అవుతున్నారు కానీ మన టాలీవుడ్ స్టార్ల రెమ్యూనరేషన్ విధానం లో కొంత మార్పు ఉంది. ఇది నిర్మాతలకు ఊరటనివ్వడం సంగతేమో కానీ నష్టం తెచ్చేదిగా ఉందని అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు'కు మహేష్ రెమ్యూనరేషన్ విషయం కూడా అలానే ఉంది.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు మహేష్ ముందే పారితోషికం తీసుకోలేదని.. దీనివల్ల నిర్మాతకు మేలు జరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెపుకొచ్చారు. అయితే ఈ విషయం చిరంజీవి చెప్పినట్టు ఏమీ లేదని సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమాకు మహేష్ బాబు ఎడ్వాన్స్ కూడా తీసుకోలేదని నిజమే అయినా మహేష్ అసలు రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే తీసుకుంటున్నారని అంటున్నారు. మహేష్ నటించిన గత రెండు సినిమాలకు.. రాబోయే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కలిపి మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ కు 150 కోట్లు పుచ్చుకున్నారని టాక్. ఈ అగ్రిమెంట్ లో లాస్ట్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' అని అంటున్నారు.

ఒక్క 'సరిలేరు నీకెవ్వరు' పారితోషికం విషయమే తీసుకుంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 55 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఇది కాకుండా సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ పై వచ్చే లాభాల్లో 30% శాతం కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మహేష్ కు ఏమాత్రం నష్టం ఉండదు. ఆ నష్టం భరించాల్సింది మాత్రం నిర్మాత.. బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. ఈలెక్కన మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగా మన స్టార్ హీరోలు ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసినందువల్ల నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News