సెన్సార్ అయిన సినిమాకు మెరుగులా?

Update: 2018-05-25 04:48 GMT
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ నానువ్వేను ఫస్ట్ నుంచి ప్లాన్ డ్ గా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫిలిం మేకర్ల ప్రయత్నం ఫలించి ఈ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ వచ్చింది. ఇంతవరకు మాస్ రోల్స్ లో విరగదీసిన కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా స్టయిల్ మార్చేసి రొమాంటిక్ జోనర్ స్మార్ట్ అండ్ సాఫ్ట్ లుక్ లో కనిపించాడు.

నా నువ్వే పాటలు మెలోడియస్ గా ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ పెరిగింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ నెలలోనే సినిమా థియేటర్లకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను 25 నుంచి జూన్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ కు సంబంధించి గ్రాఫిక్ అవుట్ పుట్ అనుకున్న స్థాయిలో రాలేదని.. అందుకే రిలీజ్ వాయిదా వేశామని సినిమా ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు చెప్పుకొచ్చారు.

నా నువ్వే రిలీజ్ ప్లాన్ చేసిన 25వ తేదీనే రజనీకాంత్ హీరోగా నటించిన కాలా మూవీ రిలీజ్ కానుంది. రజనీకి తమిళంతోపాటు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ భారీగా ఉంది. ఆ తరువాత నా నువ్వే 1వ తేదీకి పోస్టుపోన్ కాగానే.. ఇప్పుడు కాలా కూడా జూన్ 7కి వెళ్ళింది. ఒకవేళ కాలా హిట్ టాక్ తెచ్చుకుంటే దాని ప్రభావం నానువ్వేపై ఉండి తీరుతుంది. అందుకే రిలీజ్ వాయిదా వేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే నానువ్వేకు ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది.  సెన్సార్ అయిపోయిన సినిమాకు మార్పుచేర్పులు చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న వస్తోంది.
Tags:    

Similar News