నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంతమంచివాడవురా' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారట. కళ్యాణ్ రామ్ ఈమద్య కాలంలో వరుస చిత్రాలతో నిరుత్సాహపర్చుతున్నాడు. అయినా కూడా సినిమాల స్పీడ్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.
ఒక వైపు ఎంత మంచివాడవురా చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో వైపు కొత్త సినిమాకు కూడా ఓకే చెప్పాడట. మహేష్ కోనేరు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఒక చిత్రం చేయబోతున్నాడట. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు స్వయంగా వెళ్లడించాడు. 118 చిత్ర నిర్మాత అయిన మహేష్ కోనేరుతో మరో సినిమాను కళ్యాణ్ రామ్ చేసేందుకు ఓకే చెప్పాడు.
118 చిత్రానికి ముందు కూడా కళ్యాణ్ రామ్ నానువ్వే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవలే మహేష్ కోనేరు తమిళ చిత్రంను 'విజిల్' గా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు పీఆర్వోగా చేసిన మహేష్ కోనేరు నిర్మాతగా మారి వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఆయన్ను నిర్మాతగా నిలబెట్టేందుకు కళ్యాణ్ రామ్ తన మంచి మనసును చాటుకుంటూ మళ్లీ మళ్లీ మహేష్ కు ఆవకాశం ఇస్తున్నాడు.