రాయే రాయే రాయే.. పోయే పోయే పోయే.. వినవా వినవా వినవే అంటూ దేశముదురు పాడుకుంటే కుర్రకారు వెర్రెత్తిపోయింది. అ దేవ దేవ దేవ దేవ దేవుడా.. అంటూ పోకిరి పాటేసుకున్నా కుర్రకారు రిపీటెడ్‌గా పాడుకున్నారు. వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. అంటూ బిజినెస్‌మేన్ కోసం రసిక రమ్యామణి పాడుకున్న పాటను అమ్మాయిలూ పాడుకున్నారు. ఆ రేంజులో మాస్‌కి కిక్కిచ్చిన పాట ఇటీవలి కాలంలో ఒక్కటైనా ఉందా అంటే.. ప్చ్ అని పెదవి విరిచేస్తున్నారు యూత్.
ఈ ఏడాదిలో ఒకే ఒక్క పాట కాస్త మెప్పించింది. సూపర్ మచ్చి అంటూ దేవీశ్రీ జీర గొంతుతో పాడిన ఆ ఒక్క పాటా యువతరం నోళ్లలో నానింది. నీ యయ్యకు టెంపర్ .. అంటూ సాగదీసిన ఆ లైన్ ఒక్కటీ వేరొక పాటలోది గుర్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కటీ హిట్‌సాంగ్ లేదు. రుద్రమదేవి పాటల్లో మత్తే లేదని తేల్చేశారు. ఇటీవలే రిలీజైన బాహుబలి చిత్రంలోనూ పాడుకోవడానికి ఒక్క పాటా లేదు. పచ్చ బొట్టేసిన.. అనేది క్లాసిక్‌గా దృశ్యకావ్యంలా బావుంది. కానీ మాస్‌కి మత్తెక్కించే చిత్తు చేసే పాట కాదు ఇది. కాబట్టి ఇక ముందైనా కిక్కిచ్చే మత్తెక్కించే పాట ఒక్కటైనా వస్తుందా? అన్న ఎదురు చూపు తప్ప అస్సలు అంత సీను కనిపించేట్టే లేదు.
శ్రీమంతుడు పాటలు ఈనెల 18న వస్తున్నాయి. కనీసం దేవీశ్రీ అయినా ఈసారి ఓ రేంజులో ఆడియోతో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. మన మ్యూజిక్ డైరెక్టర్‌లో క్రియేటివిటీ చచ్చిందా? లేక ఉన్నదాన్ని అయినా వాడడం మర్చిపోయారా? ప్చ్ .. శ్రోతలకు అగ్ని పరీక్షా కాలమిది.