టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల దసరాకు లేదని తేలిపోయింది. అక్టోబర్ కోసం గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సినీ అభిమానులు మెల్ల మెల్లగా ఆశలు వదిలేస్తున్నారు. అక్టోబర్ లో కాదు కదా కనీసం వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా వస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యింది.. గ్రాఫిక్స్ వర్క్ కూడా గత ఏడాది నుండి చేస్తూనే ఉన్నారు కదా విడుదల చేయకుండా ఎందుకు మళ్లీ వాయిదా వేసినట్లు అంటూ కొందరు రాజమౌళిపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే వేల కోట్ల మార్కెట్ ఉండే సినిమా. కనుక విడుదల విషయంలో అంత అలాటప్పగా వ్యవహరిస్తే నష్టం తప్పదు.
బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఒక మాట చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అందుకోసం ముందస్తుగా బిజినెస్ కూడా జరిగింది. కాని ఈ సమయంలో ముందుగా అనుకున్న దాంట్లో కనీసం 50 శాతం కూడా విడుదల చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో దేశాల్లో కరోనా కేసులు వేలల్లో లక్షల్లో ఉన్నాయి. కనుక జనాలు థియేటర్లకు రావాలంటే ఇప్పట్లో వచ్చే ఆసక్తి కనిపించడం లేదు. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయడం లేదని తెలుస్తోంది.
గుడ్డి నమ్మకంతో వస్తాయిలే వసూళ్లు అనుకుని వెళ్తే ఏం జరుగుతుందో ఇటీవలే వచ్చిన బెల్ బాటమ్ సినిమా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. రెండు వందల కోట్ల మార్కెట్ ఉన్న ఆ సినిమా కనీసం పాతి కోట్లు వసూళ్లు చేయలేక చతిగిల్ల పడింది. అంతగా కరోనా భయం ప్రభావం మన దేశంలో ఉంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమాను విడుదల చేసి స్వయంగా కిల్ చేయడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో విడుదలను క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీ విషయంలో ఒకటి రెండు వారాల్లో భారీగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేమికులు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. నూరు శాతం థియేటర్లు తెరుచుకుని పరిస్థితులు నూరు శాతం కుదుట పడింది అనుకున్నపుడు మాత్రమే ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.