RRR విడుదల పై మేకర్స్ క్లారిటీ..!

Update: 2021-09-11 09:30 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకున్న RRR చిత్రాన్ని చివరగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా కావడం.. ప్రస్తుత పరిస్థితులు దీనికి అనుకూలంగా లేకపోవడంతో మరోసారి విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

RRR చిత్ర నిర్మాతలు పోస్ట్ పోన్ గురించి ప్రకటించనప్పటికీ చెప్పిన సమయానికి ఈ సినిమా విడుదల కావడం లేదనే విషయం అందరికీ అర్థం అయింది. అందుకే ఇప్పటికే ట్రిపుల్ ఆర్ స్లాట్ ని అనేక మీడియం రేంజ్ సినిమాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వాయిదా గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. ''#RRR మూవీ అక్టోబర్ 21 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటుంది. అందరూ అనుకుంటున్నట్లుగానే మేము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాము. థియేటర్లు నిరవధికంగా మూసివేయబడిన ఉన్నందున కొత్త విడుదల తేదీని ప్రకటించలేము. ప్రపంచ సినిమా మార్కెట్ ప్రారంభమైనప్పుడు మేము సాధ్యమైనంత త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాము'' అని RRR టీమ్ పేర్కొంది.

కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News