మణిరత్నం దిల్ సే సినిమాలో ఛయ్య ఛయ్యా పాట తో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ.. మలైకా అరోరా. ఈమె చేస్తుంది ఐటెమ్ నంబర్స్ అయినా హీరోయిన్ కన్నా ఎక్కువ తీసుకుంటుంది. అంతటి క్రేజ్ ఉంది ఈమె చిందులుకు. దబాంగ్ లో మున్ని బద్నామ్ పాటతో తారాస్థాయికి చేరింది మలైకా క్రేజ్. బాలీవుడ్లో హీరోయిన్ కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే ఈ మధ్య ఈమె వివాహ జీవితం కొన్ని ఓడుదుడుకులు వచ్చి చివరికి పెళ్లి పెటాకులుకు దారితీసింది.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ లు తమ 17 ఏళ్ల వైవాహిక జీవితానికి చరమగీతం పాడేశారు అన్నసంగతి తెలిసిందే. గురువారం ముంబయిలోని బాంద్రా కోర్టు అధికారికంగా విడాకుల నోటీసులు కూడా జారీ చేసింది. ఇదంతా తెలిసిందే కాని.. అసలు భరణంగా ఈమె అర్భాజ్ దగ్గర నుండి ఎంత లాగేసింది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. చాలా మంది బాలీవుడ్ నటులు విడాకులు తరువాత నష్టపరిహారం కింద భారీ మొత్తం ఇచ్చుకుంటారు.హృతిక్ రోషన్ తన మాజీ భార్య సూసాన్ కు ఐతే విడిపోయినప్పుడు భరణం కింద రూ.200 కోట్లు ఇచ్చాడు. కాని ఇక్కడ అదేం లేదులే.
మలైకా తన మాజీ భర్త నుంచి భరణం కింద ఒక్క పైసా కూడా అడగలేదట. అసలు రూపాయి కూడా డబ్బు తీసుకోలేదట. ఈ విషయాన్ని మలైకా తరఫు న్యాయవాది క్రాంతి సాథే మీడియాకు తెలియచేసారు. అర్బాజ్ కంటే మలైకా బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న స్టార్. బహుశా ఆ పరువు కోసం భరణం తీసుకోవడానికి ఒప్పుకొలేదు అనుకుంటున్నారు. ఇక భరణం తీసుకోకపోయినా కూడా మలైకా కోసం ఇప్పటికే ఖాన్ ఫ్యామిలీ చాలా ఇచ్చిందని ఒక టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/