ఈ ట్వీట్లెందుకు? కలసి ఫోటో పెట్టండి

Update: 2016-03-12 18:43 GMT
''నా విషయంలో మళ్ళీ నువ్వు వేలు పెట్టావ్‌'' అంటూ ఒక ట్వీట్‌ వేసింది మలైకా ఆరోరా ఖాన్‌. అయితే ఇది మీడియాను ఉద్ద్యేశించి వేసినదే అని.. మీడియావారు ఈమె అర్బాజ్‌ ఖాన్‌ తో విడిపోతున్నాడని ప్రచారం చేస్తున్నారు కాబట్టి.. తన విషయంలో అనవసరంగా వేలు పెట్టద్దని వార్నింగ్‌ ఇచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే బాగా కామెడీగా ఉంది.

మొన్నామధ్యన.. నేను నా పెళ్ళాం ఎలా ఉంటే మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి.. కాపురాల్లో నిప్పులు పోయకండి అంటూ మొగుడు అర్భాజ్‌ ఖాన్‌ కూడా చాలా ట్వీట్లే వేశాడు. కాని కామెడీ ఏంటంటే.. ఇన్ని ట్వీట్లు వేస్తున్నా కూడా.. రూమర్‌ రాయుళ్ళ నోళ్ళు మూయించడానికి ఒక్కసారి కూడా మేము విడిపోలేదు.. కలిసే ఉన్నాం.. అంటూ ఇటు మొగుడు కాని అటు పెళ్ళాం కాని ట్వీట్లు వేయలేదు.

పోనివ్‌ మొన్న సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చిన స్పెషల్‌ డిన్నర్‌ లో కూడా వీళ్ళిద్దరూ కలసి పోజులిస్తే ఒట్టు. ఏం బాబూ.. ఇద్దరూ ఇలా విడివిడిగా రచ్చ చేసే బదులు.. మేం కలిసే ఉన్నాం అని అందరికీ తెలిసేలా ఏవైనా ఫోటోలు ట్వీట్లు చేస్తే అయిపోతుందిగా? ఆ పని చేయండి ముందు.
Tags:    

Similar News