కారు కొన్నా అంది.. వీళ్ళు మొదలెట్టేశారు

Update: 2017-10-20 23:30 GMT
హీరోయిన్లు పలానా కార్ కొన్నాను అంటూ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టడం అనేది సర్వసాధారణమే. అలా చేస్తూ వారికి వారు చాలా హైప్ పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కార్లు కనుక ఏదన్నా ప్రత్యేకంగా ఉంటే మాత్రం.. మన స్టారీమణులకు తిప్పలు తప్పట్లేదు.

అదిగో ఆ మధ్యన తన పసుపు రంగు ఆడీ కార్ ను తెగ పాపులర్ చేసింది ఇలియానా. ఆడీ లో ఆ కలర్ ఎక్కువమంది వాడరు. కాబట్టి బొంబాయ్ రోడ్లలో ఆ కలర్ కారు కనిపిస్తే చాలు.. మనోళ్ళు వెంటనే దానిని వెంబడించి నానా రభస చేస్తున్నారు. ఒకసారి అయితే ఏకంగా ఇలియానా కారును ఆపేసి మరీ రభస చేయడంతో ఆమె ఖంగుతింది. ఇప్పుడు తాజాగా మలైకా అరోరా కూడా తానో కార్ కొన్నట్లు చెబుతూ ఒక ఫోటో షేర్ చేసింది. అయితే అప్పటికే రిజిస్టర్ అయిపోయిన కారు తాలూకు ఇమేజ్ పెడుతూ.. ఆ కార్ నెంబర్ కూడా కనిపించేలా పోస్ట్ చేసింది. దానితో వెంటనే సోషల్ మీడియాలో స్పందనలు ఎలా వచ్చాయంటే.. ఇప్పుడు మేం ఏ కారును ఫాలో అవ్వాలో మాకు తెలుసుగా అంటూ వెకిలి చేష్టలు చేస్తున్నారు కొందరు.

ఆ లెక్కన చూస్తుంటే.. ఏదో ఒక రోజు మలైకా కారుకు కూడా ఆకతాయిల నుండి ఇబ్బందులు తప్పవేమో అన్నట్లుంది పరిస్థితి. అందుకే తన కార్ల గురించి సోషల్ మీడియాలో చెప్పేటప్పుడు హీరోయిన్లు జాగ్రత్తగా ఉంటేనే బెటర్.
Tags:    

Similar News