ఎప్పుడూ బికీనీ హాలిడేలేనా బేబీ

Update: 2017-01-27 06:12 GMT
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఖాన్ గురించి.. ఈ మధ్య వస్తున్న వార్తల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సినిమాల గురించి ఉండడం లేదు. అన్నీ అర్బాజ్ ఖాన్ తో  బ్రేకప్ గురించో.. లేకపోతే పార్టీల్లో తాగేసి హంగామా చేసిందనే.. అదీ కాకపోతే బికినీలతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తోందనో మాత్రమే.

తాజాగా కూడా మలైకా ఓ హాలిడే ట్రిప్ కి వెళ్లింది. నీటి నడి మధ్యలో బికినీలో కూర్చుని ఓ ఫోటో తీయించుకుని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.  'మిడిల్ ఆఫ్ నోవేర్' అంటూ అమ్మడు పెట్టిన క్యాప్షన్ కూడా బాగుంది. అంతకు మించి ఈ భామ చూపించిన క్లీవేజ్ అందాలు.. స్విమ్ సూట్ లో పరిచిన సొగసులు మాత్రం.. అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంతలేసి అందాలున్న ఈ సుందరి వయసు.. 43 ఏళ్లు అంటే నమ్మడం కష్టమైనా తప్పదు.

అయితే.. ఎప్పుడూ ఇలాంటి వివాదాలు.. బికినీలు.. వెకేషన్స్ మాత్రమేనా.. సినిమాల సంగతి కూడా ఏమైనా చూస్తుందా అంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే.. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ అలరించిన ఈ ఐటెం బ్యూటీకి ఇప్పుడు చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. కనీసం ఐటెం సాంగ్ ను ఆఫర్ చేసే వాళ్లు కూడా కరువయ్యారు. మరి ఇకపై మలైకా అందాలను ఇలా టూర్లలో బికినీల్లో చూసి ఆనందించాల్సిందేనా అని ఫీలవుతున్నారు అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News